Telugu Global
Cinema & Entertainment

Panchathantram Movie: పంచతంత్రం మూవీ ట్రయిలర్ రివ్యూ

Panchathantram Movie: 5 కథలతో యాంథాలజీ మూవీగా వస్తోంది పంచతంత్రం సినిమా. బ్రహ్మానందం లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా నుంచి ట్రయిలర్ లాంఛ్ చేశారు.

Panchathantram Movie: పంచతంత్రం మూవీ ట్రయిలర్ రివ్యూ
X

బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్రఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌ త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ 'పంచతంత్రం'. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా పంచతంత్రం ట్రయిలర్ ను రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ రష్మిక, ఈ ట్రయిలర్ ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు.

'పంచతంత్రం' ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇది 5 జంట‌ల‌కు సంబంధించిన క‌థ అని అర్థ‌మౌతుంది. బ్ర‌హ్మానందం ఈ 5 క‌థ‌ల‌కు పంచేద్రియాలు అనే పేరు పెట్టి త‌న కోణంలో కథను స్టార్ట్ చేస్తార‌ని ట్రైల‌ర్‌ చూస్తే అర్థ‌మౌతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధ‌లు కూడా వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు మ‌నం వాటిని ఎలా స్వీక‌రించాం. మ‌న ప‌నుల‌ను ఎంత బాధ్య‌త‌గా పూర్తి చేస్తూ ముందుకెళ్లామ‌నేది ఈ యాంథాలజీ కాన్సెప్ట్.

సినిమాలో మ‌న‌కు క‌నిపించ‌బోయే 5 జంట‌ల‌కు ఒక్కో క‌థ .. ఒక్కో ర‌క‌మైన ప్ర‌యాణం.. అవ‌న్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయ‌నేది 'పంచతంత్రం' లో ఎమోష‌నల్ గా చూపించారు. ప్ర‌శాంత్ ఆర్‌.విహారి నేప‌థ్య సంగీతం.. రాజ్ కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ ట్రయిలర్ లో హైలెట్.



First Published:  26 Nov 2022 12:04 PM GMT
Next Story