Telugu Global
Cinema & Entertainment

Paarijatha Parvam | పారిజాత పర్వం టీజర్ ఎలా ఉందంటే?

Paarijatha Parvam - చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’.

Paarijatha Parvam | పారిజాత పర్వం టీజర్ ఎలా ఉందంటే?
X

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.


తాజాగా మేకర్స్ టీజర్ ని విడుదల చేశారు. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రలని పరిచయం చేస్తూ ప్రారంభమైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకులని అలరించింది.


టీజర్ చివర్లో వైవా హర్ష చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ పాత్రల ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. సునీల్ చేతిపై జై చిరంజీవా అనే టాటూ ఆకర్షించింది.


దర్శకుడు సంతోష్ కంభంపాటి హిలేరియస్ క్రైమ్ కామెడీని ప్రేక్షకులకు అందించబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. టీజర్ కి కంపోజర్ రీ అందించిన నేపధ్య సంగీతం చాలా గ్రిపింగ్ గా ఉంది. బాల సరస్వతి కెమెరా పనితనం, విజువల్స్, నిర్మాణ విలవలు ఉన్నతంగా ఉన్నాయి. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

First Published:  21 March 2024 4:12 AM GMT
Next Story