Telugu Global
Cinema & Entertainment

ఈవారం ఓటీటీలో సైంధవ్, పిండం, మరెన్నో మూవీస్, సిరీస్

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమా, డిస్నీ+హాట్ స్టార్ మొదలైన ప్లార్ ఫారమ్స్ ఈ వారం విడుదలవుతున్న కొత్త సినిమాలు, సిరీస్‌ల వాచ్ లిస్ట్ ని విడుదల చేశాయి.

ఈవారం ఓటీటీలో సైంధవ్, పిండం, మరెన్నో మూవీస్, సిరీస్
X

ఓటీటీ స్పేస్‌లో గతవారం విడుదలైన యానిమల్, సాలార్, సామ్ బహదూర్ మూడూ టాప్ ట్రెండింగ్ లో వుండగానే ఈ వారం మరిన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’ నెల పూర్తి కాక ముందే అప్పుడే వచ్చేసింది. అలాగే తెలుగు హార్రర్ ‘పిండం’ కూడా! ఇక ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ అనే ఇంగ్లీషు యాక్షన్ సిరీస్ కూడా ప్రసారం అవుతోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమా, డిస్నీ+హాట్ స్టార్ మొదలైన ప్లార్ ఫారమ్స్ ఈ వారం విడుదలవుతున్న కొత్త సినిమాలు, సిరీస్‌ల వాచ్ లిస్ట్ ని విడుదల చేశాయి. వీటిలో హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, డాక్యుడ్రామా, యానిమేషన్ కూడా వున్నాయి. కాబట్టి, ఈ వారం కొత్త ఓటీటీ విడుదలల వివరాలు చూద్దాం...

నెట్‌ఫ్లిక్స్‌ లో 11

1. మైటీ భీమ్స్‌ ప్లే టైమ్‌ (ఇంగ్లీష్‌ డాక్యుమెంటరీ)- జనవరి 29

2. ది గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 29

3. జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 30

4. నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 30

5. అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – జనవరి 31

6. బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 3

7. దిసెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ యానిమేషన్ సిరీస్) – జనవరి 31

8. విల్‌(డబ్యూఐఎల్‌) (డచ్ మూవీ) – జనవరి 31

9. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 1

10. లెట్స్ టాక్ అబౌట్ చూ(సీహెచ్‌యూ) (మాండరిన్ సిరీస్) – ఫిబ్రవరి 2

11. ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 2

అమెజాన్ ప్రైమ్ లో 4

1. మరీచి (కన్నడ మూవీ ) – జనవరి 29

2. డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) – ఫిబ్రవరి 2

3. మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 2

4. సైంధవ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి

ఆహాలో 1

1. పిండం (తెలుగు మూవీ) –ఫిబ్రవరి 2

డిస్నీ + హాట్‌స్టార్ లో 3

1. కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31

2. మిస్ ఫర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 2

3. సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 2

జియో సినిమా లో1

1. ఇన్ ది నో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 29

మనోరమా మ్యాక్స్ లో 1

1. ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) – ఫిబ్రవరి 2

బుక్ మై షో లో 1

1. అసెడియో (స్పానిష్ సినిమా) – జనవరి 30

First Published:  30 Jan 2024 10:20 AM GMT
Next Story