Telugu Global
Cinema & Entertainment

తాజా ఓటీటీ వాచ్ లిస్ట్ – నా సామి రంగ, సాలార్, కేరళ స్టోరీ...మరెన్నో!

ఈవారం వాలెంటైన్స్ డేకి స్వాగతం చెబుతూ ఓటీటీల నుంచి సరికొత్త విడుదలలు సందడి చేస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రోమాంటిక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు, డ్రామాలు ఈ సందర్భంగా మీకోసం స్ట్రీమింగ్ అవుతున్నాయి.

తాజా ఓటీటీ వాచ్ లిస్ట్ – నా సామి రంగ, సాలార్, కేరళ స్టోరీ...మరెన్నో!
X

ఈవారం వాలెంటైన్స్ డేకి స్వాగతం చెబుతూ ఓటీటీల నుంచి సరికొత్త విడుదలలు సందడి చేస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రోమాంటిక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు, డ్రామాలు ఈ సందర్భంగా మీకోసం స్ట్రీమింగ్ అవుతున్నాయి. నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ తెలుగు రోమాంటిక్ యాక్షన్ డ్రామా, హిందీలో కరణ్ జోహార్ ప్రారంభించిన నిజ ప్రేమ కథల సిరీస్ ‘లవ్ స్టోరియా’, తమిళంలో అశోక్ సెల్వన్ నటించిన ‘సభా నాయకన్’ మొదలైన హృదయాల్ని కదిలించే ప్రేమ కథలు వాలంటైన్ డే స్పెషల్స్. ఇక ‘సాలార్’ హిందీ వెర్షన్ కి వెంటాడుతున్న సస్పెన్స్ వీడి మీ ముందుకొచ్చేసింది. చాలాకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా లీగల్ డ్రామాల నుంఛీ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌ల వరకూ వెబ్ సిరీస్ సిద్ధమయ్యాయి. కొత్త ఉత్సాహం నింపే ఈ తాజా వాచ్ లిస్ట్ నిశితంగా పరిశీలిద్దాం...

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలు :

1. నా సామి రంగ- (తెలుగు)- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ -ఫిబ్రవరి 17

2. సాలార్- పార్ట్ 1 -(హిందీ) -డిస్నీ ప్లస్ హాట్ స్టార్- ఫిబ్రవరి 16

3. ది కేరళ స్టోరీ- (హిందీ)- జీ5- ఫిబ్రవరి 16

4. సభా నాయకన్ -(తమిళం)- డిస్నీ ప్లస్ హాట్ స్టార్- ఫిబ్రవరి 14

5. అబ్రహాం ఓజ్లర్ -(మలయాళం)- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ - ఫిబ్రవరి 16, 2024

నెట్ ఫ్లిక్స్ లో 6

1. గుడ్మార్నింగ్ వెరోనికా -(సీజన్ 3 వెబ్ సిరీస్ చివరి భాగం) - ఫిబ్రవరి 14

2. లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 6 -(రోమాంటిక్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14

3. ప్లేయర్స్ -(రోమాంటిక్ కామెడీ మూవీ)- ఫిబ్రవరి 14

4. అల్ రవాబీ స్కూల్ ఫర్ గర్ల్స్ సీజన్ -(జోర్డానియన్ డ్రామా సిరీస్) - ఫిబ్రవరి 15

5. హౌస్ ఆఫ్ నింజాస్ –(జపనీస్ డ్రామా) -ఫిబ్రవరి 15

6. అబిస్- (ఇంగ్లీషు )-ఫిబ్రవరి 16

అమెజాన్ లో 2

1. ఫైవ్ బ్లైండ్ డేట్స్ -(రోమాంటిక్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 13

2. లవ్ స్టోరియా -(హిందీ నిజ ప్రేమ కథల సిరీస్ ప్రారంభం ) - ఫిబ్రవరి 14

సోనీ లివ్ లో 1

1. రాయ్ సింఘానీ వర్సెస్ రాయ్ సింఘానీ (లీగల్ థ్రిల్లర్ సిరీస్ ప్రారంభం)- ఫిబ్రవరి 12

ఆపిల్ టీవీ ప్లస్ లో 1

1. న్యూ లుక్ –(వార్ సిరీస్) -ఫిబ్రవరి 14

ఆహాలో 1

1. భామాకలాపం -(వెబ్ మూవీ)- ఫిబ్రవరి 16

First Published:  13 Feb 2024 9:57 AM GMT
Next Story