Telugu Global
Cinema & Entertainment

OTT Releases This Week | ఈవారం ఓటీటీ వాచ్ లిస్ట్ ‘లియో’ సహా 13 సినిమాలతో!

OTT Movies Releases This Week in Telugu: మీకు ఇష్టమైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు మీరందుకోలేనంత మెరుపు వేగంతో కంటెంట్‌ ని విడుదల చేస్తున్నాయి.

OTT Releases This Week | ఈవారం ఓటీటీ వాచ్ లిస్ట్ ‘లియో’ సహా 13 సినిమాలతో!
X

మీకు ఇష్టమైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు మీరందుకోలేనంత మెరుపు వేగంతో కంటెంట్‌ ని విడుదల చేస్తున్నాయి. ప్రతీ వారం కొత్త వాచ్ లిస్ట్ అందిస్తున్నాయి. మీ అభిరుచులకి తగ్గ యాక్షన్, డ్రామా, రోమాన్స్ లేదా మిస్టరీ...ఒకటేమిటి అన్ని జానర్స్ లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందుబాటులో వుంటుంది. నవంబర్ చివరి వారానికి తాజా వాచ్ లిస్ట్ వచ్చేసింది... ఇందులో ముఖ్యమైనది విజయ్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ ‘లియో’. తమిళంలో దీపావళి హడావిడి తర్వాత కూడా థియేటర్లలో రన్ అవుతూనే వున్నా, ఓటీటీలోకి వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మూడవ మూవీ. ఇందులో ఇంకా సంజయ్ దత్, త్రిష , ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ తదితరులు నటించారు.

అలాగే ఈ వారం హాలీవుడ్ హిట్ ‘ఒపెన్ హైమర్’, ఇటీవల విడుదలైన సిద్ధార్థ్ నటించిన ‘చిన్నా’ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి కొన్ని ఉత్తమ విడుదలలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ జాబితాలో రైల్వే మెన్ నుంచి సుఖీ, అపూర్వ మరెన్నో వున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 456 మంది పాల్గొనే రియాలిటీ షోసిరీస్‌తో కొరియన్ డ్రామా ‘స్క్విడ్ గేమ్’ వుంది. ఇలా వివిధ భాషల్లో 13 సినిమాలు, మరెన్నో వెబ్ సిరీసులతో కూడిన తాజా వాచ్ లిస్ట్ మీద లుక్కేద్దాం రండి.


నెట్‌ఫ్లిక్స్ లో 11

లియో - నవంబర్ 24 (ఇండియాలో), నవంబర్ 28 (గ్లోబల్ వైడ్)

స్టాంఫ్ ఫ్రమ్ ది బిగినింగ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 20

లియో (హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ)- నవంబర్ 21

స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)- నవంబర్ 22

మై డామెన్ (జపనీస్ సిరీస్)- నవంబర్ 22

పులిమడ (మలయాళ సినిమా)- నవంబర్ 23

ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్)- నవంబర్ 24

ది గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ మూవీ )- నవంబర్ 24

ఐ డోన్ట్ ఎక్స్ పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ)- నవంబర్ 24

లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ మూవీ)- నవంబర్ 24

ది మేషీన్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 26

అమెజాన్ ప్రైమ్ లో 3

స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్)- నవంబర్ 22

ది విలేజ్ (తమిళ, తెలుగు వెబ్ సిరీస్)- నవంబర్ 24

ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సిరీస్)- నవంబర్ 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో 2

ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 21

చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ)- నవంబర్ 23

జీ 5 లో 1

ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ, సీజన్ 4: నవంబర్ 24

సోనీ లివ్ లో 2

చావెర్ (మలయాళ సినిమా)- నవంబర్ 24

సతియా సోతనాయ్ (తమిళ సినిమా)- నవంబర్ 24

బుక్ మై షోలో 2

ఒపెన్ హైమర్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

యూఎఫ్ ఓ స్వీడన్ (స్వీడిష్ మూవీ )- నవంబర్ 24

ఆపిల్ ప్లస్ టీవీలో 1

హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

జియో సినిమాలో 1

ది గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్)- నవంబర్ 23

ఆహాలో 1

అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే లిమిటెడ్ ఎడిసన్ (తెలుగు టాక్ షో)- నవంబర్ 24

ఈటీవీ విన్ లో 1

ఒడియన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)- నవంబర్ 24


First Published:  23 Nov 2023 5:30 AM GMT
Next Story