Telugu Global
Cinema & Entertainment

7 సినిమాలతో ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్!

ఈ వారం తాజా ఓటీటీ విడుదలల్లో మన సినిమాల్లేవు. రెండు హిందీ వెబ్ మూవీస్ వున్నాయి. వీటిలో ‘రౌతూ కా రాజ్’ పేరుతో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన సరికొత్త క్రైమ్ కామెడీ ఆసక్తికర కథతో వుంది.

7 సినిమాలతో ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్!
X

ఈ వారం తాజా ఓటీటీ విడుదలల్లో మన సినిమాల్లేవు. రెండు హిందీ వెబ్ మూవీస్ వున్నాయి. వీటిలో ‘రౌతూ కా రాజ్’ పేరుతో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన సరికొత్త క్రైమ్ కామెడీ ఆసక్తికర కథతో వుంది. అలాగే ఒకే ఇంటి పేరుగల ఆరుగురి కథతో ‘శర్మాజీ కీ బేటీ’ అనే కామెడీ వుంది. అలాగే హాలీవుడ్ స్టార్ నికోల్ కిడ్‌మాన్ నటించిన ‘ఏ ఫ్యామిలీ ఎఫైర్’ అనే రోమాంటిక్ కామెడీ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా అమెరికన్, జపనీస్, కొరియన్ మూవీస్, సిరీస్, షోస్ ఈవారం కాలక్షేపానికి సిద్ధంగా వున్నాయి. పూర్తి వివరాల కోసం కిందికి స్క్రోల్ చేయండి...

1. రౌతూ కా రాజ్ (జూన్ 28) -జీ5

నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన క్రైమ్ కామెడీ మూవీ ఇది. ఇన్‌స్పెక్టర్ దీపక్ నేగిగా నవాజుద్దీన్ ముస్సోరీలోని రౌతూ హిల్ స్టేషన్ లో జరిగిన ఆకస్మిక హత్య వెనుక మిస్టరీని ఛేదించే పనిలో పడతాడు. శాంతికి, ప్రశాంతతకి ప్రసిద్ధి చెందిన స్థానిక అంధుల పాఠశాలలో వార్డెన్ దిగ్భ్రాంతికర మరణంతో కథ ప్రారంభమవుతుంది. దీనిపై ఇన్‌స్పెక్టర్ నేగీ, సబ్-ఇన్‌స్పెక్టర్ నరేష్ డిమ్రీ (రాజేష్ కుమార్) లు జరిపే దర్యాప్తు వారి విశ్రాంత జీవితాలకి అంతరాయం కలిగిస్తుంది. కేసుని లోతుగా పరిశోధిస్తున్నప్పుడు, నిశ్శబ్దంగా కనిపించే సమాజంలో చీకటి రహస్యాలు, దాచి పెట్టిన ఉద్దేశాలూ బయటపడి నిశ్చేష్టుల్ని చేస్తాయి.

2. శర్మాజీ కీ బేటీ (జూన్ 28) -అమెజాన్ ప్రైమ్

ఆధునిక భారతీయ స్త్రీల జీవితాల్ని హాస్యభరితంగా చిత్రించే ఈ హిందీ మూవీ, ముగ్గురు మధ్యతరగతి స్త్రీలతో, ఇద్దరు యుక్తవయస్సులో వున్న అమ్మాయిలతో ఒకదానితో ఒకటి ముడిపడి వున్న కథల్ని చూపిస్తుంది. వీళ్ళందరికీ ‘శర్మ’ అనే ఒకే ఇంటిపేరు వుంటుంది. తారాగణంలో సాక్షి తన్వర్, దివ్యా దత్తా, సయామి ఖేర్ వున్నారు.

3. ఐ యామ్: సెలిన్ డియోన్ (జూన్ 25) – అమెజాన్ ప్రైమ్

ప్రసిద్ధ గాయకురాలు సెలిన్ డియోన్ జీవితపు సన్నిహిత సంగ్రహావలోకనాన్ని అందించే పదునైన, శక్తివంతమైన డాక్యుమెంటరీ ఇది. ఆమె విశిష్ట వృత్తిని, స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనే అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్‌తో ఆమె పోరాటాన్నీ ఈ డాక్యుమెంటరీ లోతుగా పరిశోధిస్తుంది.

4. ల్యాండ్ ఆఫ్ వుమెన్ (జూన్ 26) -ఆపిల్ టీవీ ప్లస్

మనోహరమైన డ్రామెడీ సిరీస్ ఇది. సాండ్రా బర్నెడా పాపులర్ నవల ‘లా టియెర్రా డీ లాస్ ముజెరెస్’ కీ అనుసరణ. ఈ ఆరు ఎపిసోడ్‌ల ధారావాహిక న్యూయార్క్ కి చెందిన గాలా అనే యువతి గందరగోళ జీవితాన్ని అనుసరిస్తుంది. ఆమె భర్త ఆర్ధిక కుంభకోణంలో చిక్కుకుని అదృశ్యమైనప్పుడు ఆమె ప్రపంచం తలకిందులు అవుతుంది. బలవంతంగా పారిపోవాల్సి వచ్చి, వృద్ధురాలైన తల్లి జూలియాతో, యుక్తవయసులో వున్న కుమార్తె కేట్ తో కలిసి వెళ్ళిపోయి ఉత్తర స్పెయిన్‌లోని ఒక విచిత్రమైన స్వస్థలంలో ఆశ్రయం పొందుతుంది. ఈ ప్రదేశాన్ని ఆమె 50 సంవత్సరాల క్రితం రహస్యమయ పరిస్థితుల్లో వదిలివేసింది. తిరిగి ఇప్పుడు తమ జీవితాల్ని పునర్నిర్మించుకోవడానికి, తమ గుర్తింపుల్ని దాచి పెట్టడానికీ ప్రయత్నిస్తున్నప్పుడు, దీర్ఘకాలంగా పాతిపెట్టిన కుటుంబ రహస్యాలు బయటపడడం ప్రారంభిస్తాయి.

5. డ్రాయింగ్ క్లోజర్ (జూన్ 27) -నెట్ ఫ్లిక్స్

ఈ జపనీస్ మూవీ అకిటో హయాసాకా అనే ప్రతిభావంతుడైన యువ కళాకారుడి జీవితాన్ని చిత్రిస్తుంది. అతను టెర్మినల్ హార్ట్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయినప్పుడు కలలు చెదిరిపోతాయి. అతను జీవించడానికి ఒక సంవత్సరం మాత్రమే మిగిలి వుండడంతో నిరుత్సాహానికి గురై, హరునా సకురాయ్‌ అనే అమ్మాయిని కలిసినప్పుడు జీవితం మారిపోతుంది. ఆమె అతడికి జీవితం పట్ల, కళల పట్లా గల అభిరుచిని పునరుజ్జీవింపజేస్తుంది. ఇది అయోయ్ మోరిటా రాసిన అత్యధికంగా అమ్ముడైన నవల ‘యోమీ ఇచినెన్ టు సేన్‌కో’ కి అనుసరణ.

6. మై లేడీ జేన్ (జూన్ 27) -అమెజాన్ ప్రైమ్

ఇంగ్లాండ్ కి చెందిన లేడీ జేన్ గ్రే ఎదుగుదలని, పాలనని ఒక విచిత్ర మలుపుతో చిత్రించే మూవీ ఇది. ఆమె ట్యూడర్ కాలపు గందరగోళ రాజకీయ దృశ్యంలోకి ప్రవేశించి

నప్పుడు, ఆమె తల్లి ఆమె వివాహాన్ని గిల్డ్ ఫోర్డ్ డడ్లీతో ఏర్పాటు చేస్తుంది. ఆమె బంధువు కింగ్ ఎడ్వర్డ్ ని హత్య చేసి సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతున్నందున, ఆమె ఆ కుట్రల్ని కోర్టులో రుజువుచేయాల్సిన బాధ్యత మీద పడుతుంది.

7. సుపాసెల్ (జూన్ 27) -నెట్ ఫ్లిక్స్

ఈ ఉత్కంఠ భరిత ఆరు భాగాల బ్రిటిష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా అనూహ్యంగా అగ్రరాజ్యాల్ని అభివృద్ధి చేసిన ఐదుగురు సాధారణ సౌత్ లండన్ వాసుల జీవితాల్ని పరిశోధిస్తుంది . ఈ వ్యక్తులు నల్లగా వుండడం తప్ప వేరే సంబంధం లేనివారు. తాము కొత్తగా కనుగొన్న సామర్థ్యాలతో వచ్చే సంక్లిష్టతల్ని, ప్రమాదాల్ని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

8. దట్ నైన్టీస్ షో -పార్ట్ 2 (జూన్ 27) -నెట్ ఫ్లిక్స్

కొత్త ఎపిసోడ్లతో తిరిగి వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో, 1995 వేసవిలో లియా అనే యువతి తన తాతామామల ఇంటికి సెలవులు ఎంజాయ్ చేయడానికి వస్తుంది. ఇక్కడ తొమ్మిది నెలల విరామం తర్వాత బాయ్‌ఫ్రెండ్ జే కెల్సో ని మళ్ళీ కలుస్తున్నప్పుడు, ఆమె నేట్ అనే మరొకడ్ని ముద్దు పెట్టుకున్న రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డం మొదలెడుతుంది.

9. ఏ ఫ్యామిలీ ఎఫైర్ (జూన్ 28) -నెట్ ఫ్లిక్స్

భారీ తారాగణంతో కూడిన హాలీవుడ్ రోమాంటిక్ కామెడీ ఇది. ఇందులో స్టార్లు నికోల్ కిడ్‌మాన్, జాక్ ఎఫ్రాన్, జోయి కింగ్, కాథీ బేట్స్, లిజా కోషీ కీలక పాత్రల్లో నటించారు. జరా అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె తన సినీ స్టార్ బాస్ క్రిస్ కోల్, తన తల్లి బ్రూక్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు షాక్‌కి గురవుతుంది.

10. సివిల్ వార్ (జూన్ 28) -అమెజాన్ ప్రైమ్

సమీప భవిష్యత్తులో అమెరికాలో పతనం అంచుకి చేరిన అస్థిరతతో కూడిన డిస్టోపియన్ థ్రిల్లర్ ఇది. టెక్సాస్, కాలిఫోర్నియాలు సహా 19 రాష్ట్రాల వేర్పాటు కారణంగా చోటుచేసుకున్న రెండవ అమెరికన్ అంతర్యుద్ధాన్ని ఈ కథనం విప్పుతుంది . ఫోటో జర్నలిస్టు లీ స్మిత్ నేతృత్వంలోని వార్ జర్నలిస్టుల బృందాన్ని ఈ కథనం అనుసరిస్తుంది.

11. ఫ్యాన్సీ డ్యాన్స్ (జూన్ 28) -ఆపిల్ టీవీ ప్లస్

జాక్స్ అనే యువతి సోదరి అదృశ్యమైన తర్వాత, ఆమె మేనకోడలికి రక్షణగా మాజీ డ్రగ్ డీలర్ వస్తాడు. ఓక్లహోమాలో నివసిస్తున్న జాక్స్, ఆమె మేనకోడలు కూడా ప్రమాదంలో పడతారు. ఈ ప్రమాదాల్ని ఎదుర్కొంటూ అదృశ్యమైన సోదరి జాడ కనుగొనేందుకు జాక్స్ పట్టు వదలకుండా ప్రయత్నిస్తుంది.

12. సావేజ్ బ్యూటీ - సీజన్ 2 ( జూన్28) -నెట్ ఫ్లిక్స్

సావేజ్ బ్యూటీ సీజన్ 2 అనేది రాజవంశం నిర్వచించే అధికార పోరాటాల్ని, చీకటి రహస్యాల్ని లోతుగా చిత్రించే వెబ్ సిరీస్. ఈ కొత్త సీజన్ లో అంతర్గత, బాహ్య బెదిరింపుల మధ్య గ్లోబల్ బ్యూటీ బ్రాండ్‌పై నియంత్రణని కొనసాగించడానికి రాజవంశం జరిపే పోరాటంతో ఈ కథ వుంటుంది.

13. ది వర్ల్ విండ్ (జూన్ 28) -నెట్ ఫ్లిక్స్

ఈ మూవీ దక్షిణ కొరియా రాజకీయాల్ని చూపిస్తుంది. అధ్యక్ష పదవిని, ఆర్థిక వ్యవస్థని నియంత్రించే శక్తివంతమైన వ్యాపార సమ్మేళనాలని కూల్చివేయాలని నిశ్చయించుకున్న ప్రధాన మంత్రి పార్క్ డాంగ్-హో చుట్టూ కథ తిరుగుతుంది. ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయడానికి తీసుకున్న తీవ్రమైన చర్యలో అధ్యక్షుడిని హత్య చేయాలని నిర్ణయించుకుంటాడు. ఉప ప్రధాన మంత్రి జంగ్ సూ-జిన్ అతడ్ని వ్యతిరేకించినప్పుడు సమస్య తలెత్తుతుంది. ఇది తీవ్రమైన రాజకీయ కలహాలకూ, అధికారం కోసం యుద్ధానికీ దారి తీస్తుంది.

14. వాండ్లా (జూన్ 28)

ఈ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సిరీస్ - టోనీ డిటెర్లిజ్జీ రాసిన అత్యధికంగా అమ్ముడైన ధారావాహిక ‘ది సెర్చ్ ఫర్ వాండ్లా’ కి అనుసరణ. ఓర్బోనా అనే గ్రహాంతర ప్రపంచంలో టెలిపతిక్ శక్తుల్ని పంచుకునే ఒక పెద్ద నీటి ఎలుగుబంటి ఒట్టో కథ.

ఇంకా... ఆహాలో ...

15. ఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ) - జూన్ 25

16. లవ్ మౌళి (తెలుగు సినిమా) - జూన్ 27

First Published:  24 Jun 2024 11:46 AM GMT
Next Story