Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ వాచ్ లిస్ట్ : సల్మాన్ ‘టైగర్ 3’, కార్తీ ‘జపాన్’ వచ్చేశాయ్!

ఈ వారం కొత్త జోడింపులతో తాజా ఓటీటీ వాచ్ లిస్ట్ వచ్చేసింది.... సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’, కార్తీ నటించిన ‘జపాన్’ సహా రోమాన్స్, హార్రర్, యాక్షన్, సస్పెన్స్ వంటి మీ దృష్టిని ఆకర్షించే అనేక కొత్త ఓటీటీ షోలు, సినిమాలు ఈ వారం మీ ముందుకొచ్చాయి.

ఓటీటీ వాచ్ లిస్ట్ : సల్మాన్ ‘టైగర్ 3’, కార్తీ ‘జపాన్’ వచ్చేశాయ్!
X

గత వారం కొన్ని గొప్ప విడుదలల తర్వాత, ఈ వారం కొత్త జోడింపులతో తాజా ఓటీటీ వాచ్ లిస్ట్ వచ్చేసింది.... సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’, కార్తీ నటించిన ‘జపాన్’ సహా రోమాన్స్, హార్రర్, యాక్షన్, సస్పెన్స్ వంటి మీ దృష్టిని ఆకర్షించే అనేక కొత్త ఓటీటీ షోలు, సినిమాలు ఈ వారం మీ ముందుకొచ్చాయి. అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఓటీటీ విడుదల ‘ది క్రౌన్ సీజన్ 6: పార్ట్ 2’, నెట్ ఫ్లిక్స్ షో చివరి సీజన్ ‘క్వీన్ ఎలిజబెత్ II’, ‘రిక్ అండ్ మోర్టీ’ సీజన్ 7. ‘టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్’, ‘ఐ లవ్ లిజ్జీ’.. ఇంకా మరెన్నో మిమ్మల్ని ఉత్తేజపర్చే టైటిల్స్ కోసం వాచ్ లిస్ట్ ని చూడండి....

నెట్ ఫ్లిక్స్ లో 16

జపాన్ - (తమిళ మూవీ) - డిసెంబర్ 11

రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్, జితన్ రమేష్‌ తదితరులు నటించిన ఈ యాక్షన్ కామెడీ జపాన్ ముని (కార్తీ) అనే పేరు మోసిన మాస్టర్ దొంగ కథ. కోయంబత్తూరులోని నగల దుకాణంలో రూ. 200 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించిన తర్వాత పోలీసులతో అతడి సంఘర్షణని ఇందులో చూడవచ్చు. ఈ వారం ఓటీటీ లో ఆకర్షణీయమైన సినిమాల్లో ఇది ఒకటి.

రిక్ & మోర్టీ సీజన్ 7: కొత్త ఎపిసోడ్ (ఇంగ్లీషు సిరీస్)- డిసెంబర్ 11

కెవిన్ హార్ట్ అండ్ క్రిస్ రాక్: హెడ్‌లైనర్స్ ఓన్లీ (ఇంగ్లీషు డాక్యుమెంటరీ) -డిసెంబర్ 12

సింగిల్స్ ఇన్ఫెర్నో: సీజన్ 3 (కొరియన్ సిరీస్)- డిసెంబర్ 12

ఇఫ్ ఐ వర్ లూయిసా సోంజా ( ఇంగ్లీషు షో) - డిసెంబర్ 13

1670- (పోలిష్ సిరీస్) –డిసెంబర్ 13

యాజ్ ది క్రో ఫ్లయిస్: సీజన్ 2 (ఇంగ్లీషు సిరీస్)-డిసెంబర్ 14

యో యో హకుషో (జపనీస్ షో)-డిసెంబర్ 14

కరోల్ అండ్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ (ఇంగ్లీషు డాక్యుమెంటరీ) -డిసెంబర్ 15

చికెన్ రన్: డాన్ ఆఫ్ ది నగెట్ 9ఇంగ్లీషు యానిమేషన్)- డిసెంబర్ 15

ఫేస్ టు ఫేస్ విత్ ఎటా - కాన్వర్సేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్(డాక్యుమెంటరీ)-డిసెంబర్ 15

ఫ్యామిలీయా (మెక్సికన్ మూవీ)- డిసెంబర్ 15

ఐ లవ్ లిజ్జీ (ఇంగ్లీషు మూవీ)-డిసెంబర్ 15

యో! క్రిస్మస్ (ఇంగ్లీషు కామెడీ)- డిసెంబర్ 15

వివంట్ (జపనీస్ సిరీస్)-డిసెంబర్ 16

ది క్రౌన్ సీజన్ 6: పార్ట్ 2 (ఇంగ్లీషు సిరీస్) -డిసెంబర్ 16

అమెజాన్ లో 2

టైగర్ 3 (హిందీ మూవీ)- డిసెంబర్ 12

మనీష్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, రణవీర్ షోరే, కుముద్ మిశ్రా, అనంత్ విధాత్ శర్మ, సర్తాజ్ కక్కర్ తదితరులు నటించిన తాజా స్పై యాక్షన్ మూవీ. టైగర్ జిందా హై, వార్, పఠాన్ స్పై యూనివర్స్ లో భాగమైన టైగర్ 3 ప్రతీకారం తీర్చుకునే తీవ్రవాది ఆతీష్ (ఎమ్రాన్ హష్మీ) ని టైగర్ (సల్మాన్ ఖాన్) అంతమొందించే కథ. తన దేశాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవడం టైగర్ లక్ష్యం. ఇందులో యాక్షన్ సీన్స్ హైలైట్. మీరు ఈ సినిమాని థియేటర్లలో చూడడం మిస్సయితే ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌పై సల్మాన్ మ్యాజిక్ ని చూసే అవకాశం లభిస్తుంది. తెలుగు వెర్షన్ అందుబాటులో వుంది.

రీచర్: సీజన్ 2 (ఇంగ్లీషు సిరీస్)- డిసెంబర్ 15

ఆపిల్ టీవీ+లో 1

టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్ (ఇంగ్లీషు డాక్యుమెంటరీ) -డిసెంబర్ 13 ఫ్యామిలీ ప్లాన్ (ఇంగ్లీషు మూవీ)- డిసెంబర్ 15

ముబీలో 1

ది డెలిక్వెంట్స్ (ఇంగ్లీషు మూవీ)-డిసెంబర్ 15

డిస్నీ +హాట్ స్టార్ లో1

ది ఫ్రీలాన్సర్: సీజన్ 2 (హిందీ సిరీస్)-డిసెంబర్

బుక్ మై షోలో 1

ది వింటర్ టైడ్ ( ఇంగ్లీషు మూవీ)- డిసెంబర్ 15

జియో సినిమాలో 1

ది డార్కెనింగ్ (ఇంగ్లీషు షో)- డిసెంబర్ 16

First Published:  11 Dec 2023 9:45 AM GMT
Next Story