Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ వాచ్ లిస్ట్ : 18 కొత్త సినిమాలు, షోలు!

ఈ నెల 15 నుంచి 19 వరకు నాలుగు రోజుల్లో 18 కొత్త సినిమాలు, షోలు అట్టహాసంగా ఓటీటీల్లో విరుచుకుపడుతున్నాయి.

ఓటీటీ వాచ్ లిస్ట్ : 18 కొత్త సినిమాలు, షోలు!
X

ఈ నెల 15 నుంచి 19 వరకు నాలుగు రోజుల్లో 18 కొత్త సినిమాలు, షోలు అట్టహాసంగా ఓటీటీల్లో విరుచుకుపడుతున్నాయి. ఇవి గత రెండు వారాల కరువుని తీర్చేస్తాయి. మనోజ్ బాజ్‌పేయి నటించిన హిందీ మూవీ ‘సైలెన్స్ 2’ నుంచీ జాక్ స్నైడర్ నటించిన హాలీవుడ్ మూవీ ‘రెబెల్ మూన్’ వరకూ ఈ వారం తాజా ఓటీటీ విడుదలల జాబితా మీ అన్ని అభిరుచుల్నీఅందుకోగలవని హామీ నిస్తోంది. ‘చీఫ్ డిటెక్టివ్ 1958’ పేరుతో దక్షిణ కొరియా గూఢచార థ్రిల్లర్ కూడా ఈ వారం మీ ముందుంది. ఇవిగాక మరెన్నో వినోదాత్మకాలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధమైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొదలైన ఓటీటీల్లో ఏఏ తేదీల్లో వీటిని వీక్షించ వచ్చో ఈ క్రింద చూడండి...

నెట్ ఫ్లిక్స్ లో 6

1. ది సింపథైజర్ (వియత్నాం గూఢచారి కథ- మినీ సిరీస్)- ఏప్రిల్ 15

2. జిమ్మీ కార్ : నేచురల్ బార్న్ కిల్లర్ (బ్రిటిష్ స్టాండప్ స్పెషల్)- ఏప్రిల్ 16

3. డోంట్ హేట్ ది ప్లేయర్ (రియాల్టీ షో)-ఏప్రిల్ 17

4. ది గ్రిమ్ వేరియేషన్స్ (ఆరు కథల జపనీస్ ఆంథాలజీ)- ఏప్రిల్ 17

5. రెబెల్ మూన్ : పార్ట్ 2 (జాక్ స్నైడర్ సైన్స్ ఫిక్షన్ మూవీ)- ఏప్రిల్ 19

6. అవర్ లివింగ్ వరల్డ్ ( పర్యావరణ యానిమీ)- ఏప్రిల్ 17

అమెజాన్ ప్రైమ్ లో 1

1. గోయింగ్ హోమ్ విత్ (టైలర్ కెమెరాన్ రియాల్టీ షో)-ఏప్రిల్ 18

జియోసినిమాలో 4

1. సైలెన్స్ 2 : ది నైట్ ఒల్ బార్ షూటవుట్ (మనోజ్ బాజ్ పాయ్ పోలీస్ థ్రిల్లర్)- ఏప్రిల్ 16 2. ఒర్లాండో బ్లడ్ : టు ది ఎడ్జ్ (స్పోర్ట్స్ అడ్వెంచర్)- ఏప్రిల్ 19

3. ఆర్టికల్ 370 ( హిందీ మూవీ)- ఏప్రిల్ 19

4. రుద్రన్ (లారెన్స్ రాఘవ నటించిన తమిళ థ్రిల్లర్)-ఏప్రిల్ 19

బుక్ మై షోలో 1

1. డ్యూన్ పార్ట్ 2 (పీరియడ్ థ్రిల్లర్)- ఏప్రిల్ 16

డిస్నీ + హాట్ స్టార్ లో 4

1. సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (ఆస్ట్రేలియన్ రియల్ లైఫ్ డ్రామా)- ఏప్రిల్ 17

2. ది సీక్రెట్ స్కోర్ (సైన్స్ ఫాంటసీ)- ఏప్రిల్ 17

3. సైరన్ (తమిళంలో భాగ్యరాజా ఆంథాజీ)- ఏప్రిల్ 19

4. చీఫ్ డిటెక్టివ్ 1958 (సౌత్ కొరియన్ థ్రిల్లర్)- ఏప్రిల్ 19

లయన్స్ గేట్ ప్లేలో 2

1. డ్రీమ్ సినేరియా (నికోలస్ కేజ్ నటించిన ఫాంటసీ) - ఏప్రిల్ 19

2. ది టూరిస్ట్ సీజన్ 2 (సిరీస్)- ఏప్రిల్ 19

First Published:  17 April 2024 11:41 AM GMT
Next Story