Telugu Global
Cinema & Entertainment

ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్ : 22 సినిమాలు, సిరీస్ లు, ఇంకా..

‘ప్రసన్న వదనం’, ‘రత్నం’, ‘క్రూ’, ‘ది కర్దాషియన్స్ సీజన్ 5’ , ‘అట్లాస్’, ‘బైయింగ్ లండన్’, ‘జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ’...ఇంకా మరెన్నో వినోదాత్మక టైటిల్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్ : 22 సినిమాలు, సిరీస్ లు, ఇంకా..
X

ఈ వారం కొత్త ఓటీటీ విడుదలల జాబితాతో వాచ్ లిస్ట్ ని అప్డేట్ చేసుకోవడానికిదే సమయం. ఇందులో ‘ప్రసన్న వదనం’, ‘రత్నం’, ‘క్రూ’, ‘ది కర్దాషియన్స్ సీజన్ 5’ , ‘అట్లాస్’, ‘బైయింగ్ లండన్’, ‘జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ’...ఇంకా మరెన్నో వినోదాత్మక టైటిల్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. టైటిల్స్ లో యాక్షన్, కామెడీ, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్, డ్రామా మొదలైన వాటిని పుష్కలంగా ఎంజాయ్ చేయవచ్చు. ఇవి గంటల తరబడి ఇంటి తెర ముందు కదలకుండా కూర్చుబెట్టేయడం ఖాయం. దిగువ జాబితాని బ్రౌజ్ చేయడానికి క్రిందికి స్క్రోల్ చేయండి...

1. ప్రసన్నవదనం (మే 24) -ఆహా

సుహాస్, రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్. విడుదలైన వారంలోనే ఓటీటీలోకి వచ్చేసింది.

2. రత్నం (మే 24) - అమెజాన్ ప్రైమ్ వీడియో

ఏప్రిల్ లో విడుదలైన విశాల్ నటించిన యాక్షన్ థ్రిల్లర్కూడా అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది.

3. క్రూ (మే 24) -నెట్‌ఫ్లిక్స్

కరీనా కపూర్, టబు, కృతీ సానన్ ముగ్గురూ ఏర్ హోస్టెస్ లు. విమాన ప్రయాణంలో చనిపోయిన ప్రయాణీకుడి బంగారు బిస్కెట్లని ఈ ముగ్గురూ స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు వారి జీవితాలు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతాయి.

4. రాచెల్ ఫెయిన్‌స్టెయిన్: బిగ్ గై (మే 21)- నెట్‌ఫ్లిక్స్

అమెరికన్ హాస్య నటి రాచెల్ ఫెయిన్‌స్టెయిన్ కొత్త స్టాండ్-అప్ కామెడీ ఇది. ఆమె అద్భుతమైన హాస్య నటనతో ప్రేక్షకుల్ని ఆనంద వినోదాల్లో ముంచెత్తుతుంది.

5. ఆక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ (మే 21) – జియో సినిమా

ఆర్థర్ కర్రీ/ఆక్వామాన్ తన సవతి సోదరుడు, అట్లాంటిస్ మాజీ రాజు ఓర్మ్ మారియస్‌తో కలిసి తన రాజ్యాన్ని బ్లాక్ మాంటా నుంచి రక్షించుకోవడం కోసం చూడవచ్చు.

6. బైయింగ్ లండన్ (మే 22) -నెట్‌ఫ్లిక్స్

డేనియల్ డాగర్స్, అతడి బృందం లండన్‌లోని విలాసవంతమైన ప్రాపర్టీ మార్కెట్‌లో నావిగేట్ చేయడం, వారి క్లయంట్స్ కి విలాసవంతమైన ఇళ్ళని ను కొనుగోలు చేయడం అమ్మడం వంటివి చేస్తారు. ఇంగ్లండ్ రాజధానిలో లండన్లో నివసించే అత్యంత సంపన్నుల విలాసవంతమైన జీవితాల సంగ్రహావలోకనం ఇది.

7. టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ఎర్త్ ( మే 22) - నెట్‌ఫ్లిక్స్

ఇది ముగ్గురు అనుభవజ్ఞులైన మాజీ యుఎస్ నేవీ సీల్, మాజీ యుఎస్ ఆర్మీ రేంజర్, బ్రిటీష్ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేటర్ లు కలిసి ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ, కొన్ని ఉన్నత సైనిక విభాగాల్లో శిక్షణ పొందడాన్ని చూపించే డాక్యూ సిరీస్ ఇది.

8. పౌలిన్ (మే 22) -డిస్నీ+ హాట్‌స్టార్

డిస్నీ+ హాట్‌స్టార్ అందిస్తున్న కొత్త జర్మన్ డ్రామా. ఓ రాత్రి ఒన్ నైట్ స్టాండ్ గా గడిపిన తర్వాత అనుకోకుండా గర్భవతి అయి- దాంతో అతీంద్రియ శక్తుల్ని పొందిన 18 ఏళ్ళ అమ్మాయి పౌలిన్ కథని ఇందులో చూడ వచ్చు.

9. యాంగ్రీ బర్డ్స్ మిస్టరీ ఐలాండ్ (మే 22) - అమెజాన్ ప్రైమ్ వీడియో

నలుగురు ఫ్రెండ్స్ ఓ ద్వీపానికి వెళ్ళి ఫ్రీగా ఎంజాయ్ చేసే అవకాశాన్ని గెలుచుకుంటారు. కానీ తిరిగి ఇంటికి చేరుకునే మార్గాన్ని కనుక్కోలేక నానా పాట్లు పడతారు.

10. ట్రైయింగ్ : సీజన్ 4 (మే 22) -ఆపిల్ ప్లస్ టీవీ

మధ్య వయస్కులైన నిక్కీ -జాసన్ లు తాము దత్తత తీసుకున్న కుమార్తె జన్మనిచ్చిన తల్లితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, తీవ్ర మానసిక క్షోభకి లోనయ్యే డ్రామా ఇది.

11. ఇన్ గుడ్ హ్యాండ్స్ 2 (మే 23) - నెట్‌ఫ్లిక్స్

ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి కొడుకుతో కలిసి ఒక విషాదాన్ని ఎదుర్కొన్న తర్వాత, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించే హృదయాల్ని కదిలించే చిత్రణ.

12. ది కర్దాషియన్స్ సీజన్ 5 (మే 23) - డిస్నీ+ హాట్‌స్టార్

క్రిస్ జెన్నర్, కోర్ట్నీ కర్దాషియన్ బార్కర్, కిమ్ కర్దాషియన్, ఖోలో కర్దాషియన్, కెండల్ జెన్నర్, కైలీ జెన్నర్‌ల జీవితాల్లోకి ప్రేక్షకులకి అన్ని-యాక్సెస్ పాస్‌ లని అందించే ప్రసిద్ధ రియాలిటీ షో కొత్త సీజన్‌తో తిరిగి వచ్చేసింది...

13. బ్లూ ఏంజిల్స్ (మే 23) -అమెజాన్ ప్రైమ్ వీడియో

డాక్యుమెంటరీ బ్లూ ఏంజిల్స్ అని పిలిచే యూఎస్ నేవీ ఎలైట్ ఫ్లైట్ డెమోన్‌స్ట్రేషన్ స్క్వాడ్‌ కథ చెబుతుంది. వీరు ఒక జట్టుగా తమ లక్ష్యాన్ని సాధించడానికి అనేక సవాళ్ళని అధిగమిస్తారు.

14. అట్లాస్ (మే 24) - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ నుంచి ఉత్కంఠ రేపే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌...కృత్రిమ మేధస్సు (ఏఐ) ని విశ్వసించలేని ఒక స్మార్ట్ టెర్రరిజం డేటా ఎనలిస్ట్ కథ. ఆమె తిరుగుబాటు చేసిన రోబోట్‌ని పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు, మానవాళిని రక్షించే ఏకైక ఆశ ఏఐని విశ్వసించడమేనని గ్రహిస్తుంది.

15. జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ (మే 24) - నెట్‌ఫ్లిక్స్

ఈ ఉత్తేజపర్చే యానిమేటెడ్ డ్రామా క్యాంప్ క్రెటేషియస్ గ్యాంగ్ చుట్టూ తిరుగుతుంది. మానవులకి, డైనోసార్‌లకీ ప్రమాదం కలిగించే రహస్య కుట్రని విప్పే కథ.

16. మై ఓనీ గర్ల్ (మే 24) - నెట్‌ఫ్లిక్స్

జపనీస్ యానిమే ఫాంటసీ ఇది. ఓనీ అనే అమ్మాయితో ఊహించని పరిచయంతో ఒక హైస్కూలు విద్యార్థి జీవితం తలకిందులవుతుంది.

17. ది బీచ్ బాయ్స్(మే 24) -డిస్నీ+ హాట్‌స్టార్

ఈ డాక్యుమెంటరీ రాక్ బ్యాండ్ ‘ది బీచ్ బాయ్స్’ సంగీత ప్రపంచం విప్లవాత్మకంగా మారర్పులు తెచ్చే క్రమాన్ని చూపిస్తుంది.

18. పాస్ట్ లైస్ (మే 24) -డిస్నీ+ హాట్‌స్టార్

స్పానిష్ థ్రిల్లర్ డ్రామా స్పానిష్ సిరీస్ ఇది. 20 సంవత్సరాల క్రితం పాఠశాల పర్యటనలో అదృశ్యమైన విద్యార్థులలో ఒకరి మృత దేహం దొరికినప్పుడు అల్లకల్లోలమైన జీవితాలు ఎవరివి?

19. క్వీన్ లో మాటో (మే 24) - అమెజాన్ ప్రైమ్ వీడియో

టెలివిజన్ హోస్ట్ పాకో స్టాన్లీ హత్యకి సంబంధించిన సంఘటనల్ని వివరించే పరిశోధనాత్మక డ్రామా. 1990ల చివర్లో షాకింగ్ న్యూస్ మీడియా ప్రపంచాన్ని ఎలా మార్చిందో వెలుగులోకి తెస్తుంది.

20. అబర్ రాజనీతి (మే24) – హోయిచోయ్

బెంగాలీ రాజకీయ డ్రామా. ఒక రహస్యాన్ని ఛేదించడానికి రిజ్‌పూర్‌కు తిరిగి వచ్చిన ఒక మహిళ జీవితాన్ని వెల్లడిస్తుంది. అయితే ఎన్నికలకి ముందు చనిపోయిన కుటుంబ సభ్యుడు తిరిగి వచ్చినప్పుడు, ఆమె మోసపు వలలో చిక్కుకుంటుంది.

21. వాంటెడ్ మాన్ (మే 24) - లయన్స్‌గేట్ ప్లే

ఒక అమెరికన్ పోలీసు అధికారి చుట్టూ తిరిగే కథ. అతను మెక్సికన్ సరిహద్దులో హత్య కేసు సాక్షిని రక్షించడానికి వెళ్ళినప్పుడు ఇబ్బందుల్లో పడతాడు.

22. జమ్నాపార్ (మే 24) -అమెజాన్ మినీ టీవీ

సమాజంలోని వివిధ సంక్లిష్టతల్ని దాటుతున్నప్పుడు తన మూలాల్ని కనుగొన్న యువకుడిని అనుసరించే రాబోయే కాలపు కథ. ఈ సిరీస్ లో రిత్విక్ సాహోర్, వరుణ్ బడోలా, రఘు రామ్, సృష్టి రిందానీ, అంకితా సైగల్ కీలక పాత్రల్లో నటించారు.

First Published:  21 May 2024 2:06 PM GMT
Next Story