Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ వాచ్ లిస్ట్ : ఆసక్తి కలిగించే 12 సినిమాలు, షోలు ఈవారం!

ఈవారం అనురాగ్ కశ్యప్, గుల్షన్ దేవయ్య, హర్లీన్ సేథీలు నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ ‘బాడ్ కాప్’ ఒక చెప్పుకోదగ్గ కాలక్షేపం అనుకోవచ్చు.

ఓటీటీ వాచ్ లిస్ట్ : ఆసక్తి కలిగించే 12 సినిమాలు, షోలు ఈవారం!
X

ఇంటింటా ఇన్ఫోటైన్‌మెంట్ కంటెంట్‌ని అందించే వందలాది స్ట్రీమింగ్ ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియోసినిమా ఇంకా మరికొన్ని ప్రధానమైనవి. ప్రపంచవ్యాప్తంగా వున్న తమ విభిన్న అభిరుచుల చందాదారుల కోసం ఇవి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈవారం అనురాగ్ కశ్యప్, గుల్షన్ దేవయ్య, హర్లీన్ సేథీలు నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ ‘బాడ్ కాప్’ ఒక చెప్పుకోదగ్గ కాలక్షేపం అనుకోవచ్చు. అలాగే జెస్సికా ఆల్బా నటించిన పవర్ఫుల్ స్పెషల్ ఫోర్సెస్ కమాండో పాత్రతో ‘ట్రిగ్గర్ వార్నింగ్‌’, దీంతో బాటు ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ అనే యాక్షన్ అడ్వెంచర్, హిందీ ‘ కోటా ఫ్యాక్టరీ 3’ వంటి ప్రసిద్ధ వెబ్ సిరీస్‌లు కొత్త సీజన్స్ తో ఈ వారం దర్శనమిస్తున్నాయి. అలాగే ‘బాక్’ తెలుగు మూవీ, ‘నడిగర్ తిలగం’ తమిళ మూవీ కూడా ఈవారమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవిగాక రెండు యానిమేషన్లున్నాయి. పూర్తి వివరాల కోసం క్రిందికి స్క్రోల్ చేయండి...

1. హౌస్ ఆఫ్ది డ్రాగన్, సీజన్ 2 (జూన్ 17) –జియో సినిమా

ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో మొదటి సీజన్‌లో చెలరేగిన వివాదాల్ని తీవ్రతరం చేస్తూ హౌస్ టార్గారియన్‌లోని అధికార పోరాటాలని మరింత లోతుగా చూపిస్తుంది. ఇందులో రైనైరా టార్గారియన్, ఆమె వర్గం హైటవర్స్ పై స్థానాల్ని పటిష్టం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో రెనైరా, లేడీ జీన్ అర్రిన్ నుంచి మద్దతు కోరడంతో కొత్త పొత్తులు ఏర్పడతాయి. అయితే మాంత్రికురాలు అలైస్ రివర్స్ అలిసెంట్ పక్షాన పోటీలో చేరుతుంది. ఈ సీజన్‌లో డాన్స్ ఆఫ్ ది డ్రాగన్‌లు తీవ్ర పోరాటానికి దిగడంతో రాజకీయ కుట్రలు, భీకర యుద్ధాలు జరుగుతాయి.

2. క్లెక్స్ అకాడెమీ (జూన్ 19) – నెట్ ఫ్లిక్స్

జాన్ బ్రజెచ్వా రాసిన పోలిష్ ఫాంటసీ నవలకి అనుసరణ ఇది. క్లెక్స్ అకాడమీ విచిత్ర కథా ప్రపంచంలోకి తీసికెళ్ళే ఒక ఫాంటసీ. అకాడెమీలో అసాధారణ ప్రొఫెసర్ అంబ్రోజి క్లెక్స్ నేతృత్వంలో, యువ విధ్యార్ధి అడా అద్భుత కథల్ని, సజీవంగా వుండే పరిసరాల్నీ ఆవిష్కరిస్తాడు.

3. ఫెడరర్: ట్వెల్వ్ ఫైనల్ డేస్ (జూన్ 20 ) -అమెజాన్ ప్రైమ్

ఈ డాక్యుమెంటరీ టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్ కి సంబంధించిన అద్భుత కెరీర్ చివరి దశని ప్రదర్శిస్తుంది. ఫెడరర్ 2022 లో తన చివరి టోర్నమెంట్ లావర్ కప్ కోసం సిద్ధమవుతు

న్నప్పుడు, అతను టెన్నిస్‌ కి వీడ్కోలు పలికిన భావోద్వేగ క్షణాల్ని అపూర్వంగా ఈ డాక్యుమెంటరీ చిత్రిస్తుంది.

4. కోటా ఫ్యాక్టరీ, సీజన్ 3 (జూన్ 20) -నెట్ ఫ్లిక్స్

ఈ వెబ్ సిరీస్ మూడవ సీజన్లో రాజస్థాన్‌లోని కోటాలో ఐఐటీ ప్రవేశ పరీక్షలకి హాజరవుతూ తీవ్రమైన ఒత్తిళ్ళకి లోనయ్యే వైభవ్, అతడి స్నేహితుల కథని చిత్రిస్తుంది.

5. బ్యాడ్ కాప్ (జూన్ 21) - డిస్నీ+ హాట్‌స్టార్‌

కఠిన చట్టాలు అమలయ్యే ప్రపంచంలో బాడ్ కాప్ కరణ్‌పై కేంద్రీకృతమై వుండే కథ ఇది. ఈ చెడ్డ పోలీసు అధికారి కనిపించే దానికంటే శక్తివంతమైన, ఘోరమైన విలన్. ఇతను వృత్తిలో కుళ్ళిన వ్యవస్థ గుండా వెళుతున్నప్పుడు జీవితం దుర్భరంగా మారిపోతుంది. ఇతడి పోలికలతోనే వున్న అర్జున్ రాకతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ షోలో అనురాగ్ కశ్యప్, గుల్షన్ దేవయ్య, హర్లీన్ సేథి, అనుపమ్ కె. సిన్హా కీలక పాత్రల్లో నటించారు. 6. కోడ్ గీస్: రోజ్ ఆఫ్ ది రీక్యాప్చర్ (జూన్ 21) -డిస్నీ+ హాట్‌స్టార్‌లో

ఇది గీస్ ఫ్రాంచైజీలో తాజా యానిమేషన్. బ్రిటానియన్ సామ్రాజ్యం పతనం నుంచి ఇంకా కొట్టుమిట్టాడుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నఇద్దరు సోదరులు రోజ్ యాష్‌ల కథ ఇది. నియో బ్రిటానియా బలగాలు హక్కైడోని ఆక్రమించిన నేపధ్యంలో కథ మొదలవుతుంది.

7. గ్యాంగ్స్ ఆఫ్ గలీసియా (జూన్ 21) –నెట్ ఫ్లిక్స్

ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గలీసియా’ మాడ్రిడ్‌కి చెందిన అనుభవజ్ఞురాలైన న్యాయవాది అనా కథ చెబుతుంది. ఆమె తండ్రి మరణం తర్వాత కాంబాడోస్ అనే చిన్న పట్టణానికి మకాం మారుస్తుంది. తండ్రి మరణం వెనుక వున్న నిజాన్ని వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ లక్ష్యం ఆమెని డ్రగ్ కార్టెల్స్ చీకటి ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. వెంటనే ఆమె అక్క్ద డ్రగ్ లార్డ్ కొడుకు దృష్టిలో పడుతుంది. అయినా ఆమె దాగిన నిజల్ని లోతుగా పరిశోధిస్తున్నప్పుడు, వ్యవస్థీకృత నేరాల, ద్రోహపూరిత ప్రపంచంలో బలంగా చిక్కుకుపోతుంది .

8. ది బేర్, సీజన్ 3 (జూన్ 21) -డిస్నీ+ హాట్‌స్టార్‌

ఈ వెబ్ సిరీస్ మూడవ సీజన్లో కార్మెన్, చికాగో శాండ్‌విచ్ షాపుని అగ్రశ్రేణి భోజన శాలగా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, రెస్టారెంట్ పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయి.

9. ట్రిగ్గర్ వార్నింగ్ (జూన్ 21) -నెట్ ఫ్లిక్స్

స్పెషల్ ఫోర్సెస్ కమాండో పార్కర్ పాత్రలో జెస్సికా ఆల్బా నేతృత్వంలోని యాక్షన్ థ్రిల్లర్ ఇది. తండ్రి ఆకస్మిక మరణంతో ఆమె స్వగ్రామానికి తిరిగి వెళ్తుంది. అక్కడ సమాజాన్ని భయభ్రాంతులకి గురిచేస్తున్న హింసాత్మక ముఠాతో తలపడుతుంది. నేరస్థుల కార్యకలాపాల్ని లోతుగా పరిశోధిస్తున్నప్పుడు, ఆమె తండ్రి మరణంతో ముడిపడి వున్న ఒక ప్రమాదకర కుట్రని వెలికితీస్తుంది.

10. రైజింగ్ ఇంపాక్ట్, (జూన్ 22) -నెట్ ఫ్లిక్స్

నకాబా సుజుకా ప్రఖ్యాత యానిమేషన్ మాంగాకి అనుసరణ ఇది. బేస్ బాల్ పట్ల మక్కువ వున్న మూడవ తరగతి విద్యార్థి గవైన్ నానౌమి కథని ఇది హైలైట్ చేస్తుంది. అతను వృత్తిపరమైన గోల్ఫ్ క్రీడాకారిణి కిరియా నిషినోని కలుసుకున్నప్పుడు, అతడి జీవితం నాటకీయ మలుపు తిరుగుతుంది.

11. బాక్, తెలుగు మూవీ (జూన్ 21) - డిస్నీ ప్లస్ హాట్ స్టార్

తమిళంలో సూపర్ హిట్టయిన ‘అరణ్మణై 4’ తెలుగు డబ్బింగ్ ఇది. ఈ హార్రర్ కామెడీలో తమన్నా భాటియా, రాషీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. సుందర్ సి దర్శకుడు.


12. నడిగర్ తిలగం, తమిళ మూవీ (జూన్ 21)

తమిళ భాషలో వచ్చిన కామెడీ మూవీ ఇది. ఈ మధ్య కాలంలో తమిళంలో కామెడీ సినిమాలు వచ్చి చాలా కాలమే అయింది. కాబట్టి సరదాగా నవ్వుకోడానికి చూసేయొచ్చు.

First Published:  18 Jun 2024 11:03 AM GMT
Next Story