Telugu Global
Cinema & Entertainment

ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్ – ఆవేశం, దీపికా పడుకొనే హాలీవుడ్ వగైరా!

ఈ వారం బాలీవుడ్ స్టార్ దీపికా పడుకొనే, హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ తో కలిసి నటించిన యాక్షన్ మూవీ ‘ XXX: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ ప్రత్యేకాకర్షణగా వుంది. ఈ వారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇతర కొత్త ఓటీటీ విడుదల్లో ‘అన్ దేఖీ’ హిందీ సీజన్ 3 తో బాటు, ‘ఆవేశం’ సినిమ కూడా వుంది.

ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్ – ఆవేశం, దీపికా పడుకొనే హాలీవుడ్ వగైరా!
X

చాలా ఓటీటీలు దాదాపు ప్రతిరోజూ కొత్త కంటెంట్‌ని స్ట్రీమింగ్ చేస్తున్నందున, కొత్త సోష్ ని, సినిమాలనీ ట్రాక్ చేయడం కష్టమే. ప్రేక్షకులకి ఇష్టమైన షో లేదా సినిమా మిస్సయి ఎప్పుడో ఎక్కడో దాని గురించి తెలుసుకుని చూసే ప్రయత్నం చేయడం ఒక పద్ధతి. ఇది గాక వారం వారం అప్డేట్ అయ్యే ఇలాటి వాచ్ లిస్ట్ ని ఫాలో అవడం ఇంకో పద్ధతి. ప్రేక్షకుల్ని ట్రాక్‌లో వుంచడానికి వాచ్ లిస్ట్ ని మించిన ఆప్షన్ లేదు. ఈ వాచ్ లిస్ట్ ఏ వారానికా వారం కొత్త స్ట్రీమింగ్ సమాచారాన్ని అందిస్తుంది. అలాగే ఈ వారం బాలీవుడ్ స్టార్ దీపికా పడుకొనే, హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ తో కలిసి నటించిన యాక్షన్ మూవీ ‘ XXX: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ ప్రత్యేకాకర్షణగా వుంది. ఈ వారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇతర కొత్త ఓటీటీ విడుదల్లో ‘అన్ దేఖీ’ హిందీ సీజన్ 3 తో బాటు, ‘ఆవేశం’ సినిమ కూడా వుంది. ‘హాలీవుడ్ కాన్ క్వీన్’, ‘ది ఫైనల్ ఎటాక్ ఆన్ వెంబ్లీ’, ‘బోడ్‌కిన్’, ‘క్రేజీ రిచ్ ఆసియన్స్ ‘వంటి టైటిల్స్ వున్నాయి. ఇవిగాక ఇంకా ఏమేం వున్నాయో లిస్టు చూద్దాం.

1. XXX: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ (మే 7)- నెట్ ఫ్లిక్స్

XXX మూవీ సిరీస్‌లో ఇది మూడవ భాగం. జాండర్ కేజ్ (విన్ డీజిల్) తను విధించుకున్న నిర్బంధ అజ్ఞాత వాసం నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్న కథని ఇది చెబుతుంది. అతను యాక్షన్ లోకి తిరిగి వచ్చిన క్షణంలో, అతడికి ఆల్ఫా యోధుడు జియాంగ్, అతడి గ్యాంగ్ పాల్పడబోతున్న దుశ్చర్య గురించి సమాచారమందుతుంది. పండోరా బాక్స్ అనే మహా మారణాయుధాన్ని చేజిక్కుంచుకుని ప్రపంచాన్ని గడగడలాడించాలనుకుంటున్న జియాంగ్ అండ్ గ్యాంగ్ ని జాండర్ కేజ్ ఎలా నిర్మూలించాడన్నది చూసి తీరాల్సిందే.2. డార్క్ మేటర్ (మే 8)- ఆపిల్ టీవీ ప్లస్

ఈ సైన్స్ ఫిక్షన్ సిరీస్ చికాగోలో జరుగుతుంది. ఈ కథ ఒక భౌతిక శాస్త్రవేత్త గురించి. ఒకానొక రోజు అతను నిజ జీవితం నుంచి ప్రత్యామ్నాయ జీవితం లోకి ప్రవేశించినట్టు తెలుసుకుంటాడు. తిరిగి నిజ జీవితంలోకి వెళ్ళక పోతే కుటుంబానికి హాని జరగడం ఖాయమని అర్ధమై సంఘర్షణకి లోనవుతాడు.

3. హాలీవుడ్ కాన్ క్వీన్ (మే 8)- ఆపిల్ టీవీ ప్లస్ +

కాన్ క్వీన్ అనే మాయలాడి హాలీవుడ్‌ ఎగ్జిక్యూటివ్‌లాగా నటించడం ప్రారంభించి నప్పుడు, ఒక జర్నలిస్టు, ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఆమెని పట్టుకోవడానికి బయల్దేరతారు.

4. ఫైనల్ ఎటాక్ ఆన్ వెంబ్లీ (మే 8)- నెట్‌ఫ్లిక్స్

2021లో ఇంగ్లండ్ యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అడుగుపెట్టినప్పుడు, నెలల తరబడి సాగిన లాక్‌డౌన్ తర్వాత అభిమానులు పెద్ద సంఖ్యలో వెంబ్లీ స్టేడియానికి చేరుకుంటారు. 6,000 మంది టిక్కెట్‌లేని ఫుట్‌బాల్ అభిమానులు చొరబడి విధ్వంసానికి పాల్పడినప్పుడు ఏర్పడిన పరిణామాలు ఇందులో చూడొచ్చు.

5. క్రేజీ రిచ్ ఆసియన్స్ (మే 8)- నెట్ ఫ్లిక్స్

ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి సింగపూర్‌లో తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. మొదటి సారి సింగపూర్ ని సందర్శించడానికి ఉత్సాహంగా వెళ్తే, అక్కడ బెస్ట్ ఫ్రెండ్ కుటుంబం సింగపూర్‌లోని అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటి. అంతే గాక ఆ బెస్ట్ ఫ్రెండ్ నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాచిలర్ అని కూడా తెలుసుకున్నప్పుడు ఆమె భారీ షాక్‌కి గురవుతుంది. ఎందుకు? ఇది చూసి తెలుసుకోవాల్సిందే.

6. ఆవేశం (మే 9)- అమెజాన్ ప్రైమ్ వీడియో

ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేయడానికి ముగ్గురు ఫ్రెండ్స్ కేరళ కెళ్తారు. అక్కడ ఒక సీనియర్ విద్యార్థితో గొడవ పడతారు. వాడికి గుణపాఠం చెప్పడానికి ముగ్గురూ ప్రసిద్ధ గ్యాంగ్‌స్టర్ రంగాతో స్నేహం చేస్తారు. రంగాతో అనుబంధం చదువులపైనే ప్రభావం చూపడం ప్రారంభించి, ఆ ముగ్గురి జీవితాల్లో అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన తాజా మలయాళం సినిమా ఇది.


7. బోడ్కిన్ (మే 9)- నెట్ ఫ్లిక్స్

ఐరిష్ తీరప్రాంత పట్టణం నేపథ్యంలో సాగే ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ విభిన్నమైన పాడ్‌కాస్టర్‌ల బృందం చుట్టూ తిరుగుతుంది. ముగ్గురు అపరిచితుల అంతుచిక్కని అదృశ్యంపై దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు ఊహించిందానికంటే భయంకర విషయాలే బయటపడతాయి.

8. మదర్ ఆఫ్ ది బ్రైడ్ (మే 9)- నెఫ్లిమింగ్ స్ట్రీక్స్

ఆమె లండన్‌లో ఒక సంవత్సరం గడిపిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది. రాగానే తల్లికి షాకింగ్ న్యూస్ చెప్తుంది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో ఓ రిసార్ట్స్ లో ఓ నెల రోజుల్లో పెళ్ళి చేసుకోబోతున్నట్టు చెప్పేసరికి, ఆమె తల్లి కళ్ళు తిరుగుతాయి- ఎందుకంటే, ఈ వరుడు పది సంవత్సరాల క్రితం తన హృదయాన్ని కొల్లగొట్టిన వ్యక్తి కొడుకు!

9. థాంక్యూ, నెక్స్ట్ (మే 9) –నెట్ ఫ్లిక్స్

ప్రేమలో బాధాకరమైన అనుభవం తర్వాత ఆ యువ న్యాయవాది ఫ్రెండ్స్ మద్దతుతో ఆధునిక డేటింగ్ గందరగోళ ప్రపంచంలోకి ప్రవేశించి మరింత గల్లంతై పోతాడు.

10. ది గోట్ (మే 9)- నెట్ ఫ్లిక్స్

14 మంది రియాలిటీ సూపర్‌స్టార్‌లు హోస్ట్ డేనియల్ టోష్ పర్యవేక్షణలో గోట్ నివాసంలోకి ఆహ్వానాలందుకుని వస్తారు. ఈ గేమ్ లో వాళ్ళు 20 చాలెంజీలని ఎదుర్కోవాలి. ఎదుటి వారి నమ్మకాన్ని పొందడమో, పోగొట్టుకోవడమో చేయాలి.

11. లివింగ్ విత్ లెపర్డ్స్ (మే 10) -నెట్ ఫ్లిక్స్

రెండు చిరుత పులి పిల్లల్ని సినిమా షూటింగ్ సిబ్బంది ఫాలో అయి డాక్యుమెంటరీ తీస్తారు. చిరుతల బాల్యం నుంచి యుక్తవయస్సు వరకూ మంత్రముగ్దుల్ని చేసే వాటి జీవితా ల్ని రికార్డు చేస్తారు.

12. కుకింగ్ అప్ మర్డర్: అంకవరింగ్ ది స్టోరీ ఆఫ్ సీజర్ రోమన్ (మే 10)- నెట్‌ఫ్లిక్స్

ఒక స్పానిష్ చెఫ్‌కి సంబంధించిన హత్య కేసుని పరిశీలించే దాక్యూ సిరీస్ ఇది.

13. మార్ష్ కింగ్స్ డాటర్ (మే 10)- లయన్స్ గేట్ ప్లే

గతంలో మార్ష్ రాజు తన తల్లిని అపహరించిన తర్వాత హెలెనా తన బాల్యంలో మొదటి రెండు సంవత్సరాలు బందిఖానాలో గడుపుతుంది. తన కుమార్తెకి కూడా అదే గతి పడుతుందనే భయంతో జీవిస్తున్న హెలెనా, అరణ్యంలో జీవించడం గురించి తనకు తెలిసిన ప్రతిదాన్నీ కుమార్తెకి నేర్పించడానికి ప్రయత్నాలు మొదలెడుతుంది.

First Published:  7 May 2024 10:15 AM GMT
Next Story