Telugu Global
Cinema & Entertainment

Operation Valentine | ఆపరేషన్ వాలంటైన్ ట్రయిలర్ రివ్యూ

Operation Valentine - వరుణ్ తేజ్ కొత్త సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమా ట్రయిలర్ ఎలా ఉందో చెక్ చేద్దాం.

Operation Valentine | ఆపరేషన్ వాలంటైన్ ట్రయిలర్ రివ్యూ
X

వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్‌, రామ్‌చరణ్‌ లాంచ్ చేశారు.

ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్)కి గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా పీడకలలు వస్తుంటాయి. కానీ అది అతని వైఖరి, విధానాన్ని మార్చలేదు. అతను మొండి పట్టుదలగలవాడు. రాడార్ ఆఫీసర్ సోనాల్ (మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉన్న అడ్వంచర్ లవర్.

మరోవైపు పుల్వామా దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణిస్తారు. ఇంతకుముందు ఓటమిని ఎదుర్కోని భారత వైమానిక దళం శత్రువులపై వైమానిక దాడిని ప్రకటిస్తుంది. టీంకు నాయకత్వం వహిస్తున్న అర్జున్ తన యుద్ధ విమానానికి గ్రెనేడ్ తగలడంతో ప్రమాదంలో పడతాడు. అయితే, అతనికి మార్గనిర్దేశం చేసేందుకు రాడార్ ఆఫీసర్ సోనాల్ ఉంటుంది.

వరుణ్ తేజ్ చేసిన సాహసాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ రెండింటిలోనూ అదరగొట్టారు. భారత వైమానిక దళం ధైర్యానికి గుర్తింపుగా, ఆపరేషన్ వాలెంటైన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తోంది.

గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులని ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్ ని పంచుతోంది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా అద్భుతమైన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కట్టిపడేశారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మార్చి 1న వస్తోంది ఆపరేషన్ వాలంటైన్.

First Published:  20 Feb 2024 5:08 PM GMT
Next Story