Telugu Global
Cinema & Entertainment

Ooru Peru Bhairavakona | ప్రీమియర్స్ తో హిట్ కొట్టిన సందీప్ కిషన్

Ooru Peru Bhairavakona - సందీప్ కిషన్ తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఆల్రెడీ సక్సెస్ టాక్ వచ్చేసిందని చెబుతోంది యూనిట్.

Ooru Peru Bhairavakona | ప్రీమియర్స్ తో హిట్ కొట్టిన సందీప్ కిషన్
X

సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించాడు. అనీల్ సుంకర సమర్పకుడు.

రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఆల్రెడీ ప్రీమియర్స్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రీమియర్స్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రేపు ఈ సినిమా (ఫిబ్రవరి16న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

"దాదాపు 100 ప్రీమియర్ షోలు పడ్డాయి. థియేటర్స్ కి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్ కి థాంక్స్. పాటలు, ట్రైలర్ కు మీరు ఇచ్చిన రెస్పాన్స్, మా మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి చాలా రుణపడి ఉన్నాం. ముందుగా చెప్పినట్లే ప్రిమియర్ షో టికెట్ ఉన్న వారు ఆ టికెట్ తో 20 శాతం డిస్కౌంట్ వివాహభోజనంభు రెస్టారెంట్ లో పొందవచ్చు. ఇది నా తరపున ప్రేక్షకులకు చిరు కానుక. ప్రీమియర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా పెర్ఫార్మెన్స్ ని చాలా మెచ్చుకున్నారు. ఇది చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.''

ఇలా తన ఆనందాన్ని పంచుకున్నాడు సందీప్ కిషన్. ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని ముందే తెలుసని, అందుకే 2 రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశామని తెలిపాడు. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారా ఇప్పటికే కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది.

First Published:  15 Feb 2024 4:42 PM GMT
Next Story