Telugu Global
Cinema & Entertainment

Ramcharan Shankar: ఒక్క పాట కోసం రూ.15 కోట్లు ఖర్చు

Ramcharan Shankar: రామ్ చరణ్, శంకర్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాట కోసం అక్షరాలా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు.

Ramcharan Shankar: ఒక్క పాట కోసం రూ.15 కోట్లు ఖర్చు
X

శంకర్ అంతే. వెండితెరపై భారీతనం చూపించేందుకు కోట్లలో ఖర్చు చేయిస్తుంటాడు. భారీతనం ఇతడి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం కూడా శంకర్ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. సింగిల్ సాంగ్ కోసం ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నాడు.

రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాలో ఓ సాంగ్ ను న్యూజిలాండ్ లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ ఒక్క సాంగ్ కోసం అక్షరాలా 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందట. మేకింగ్ లో ట్రెండ్ సెట్ చేయడం శంకర్ స్టయిల్. గతంలో బాయ్స్, భారతీయుడు, జీన్స్ లాంటి సినిమాలతో ఇలానే ట్రెండ్ సెట్ చేసిన శంకర్, ఇప్పుడీ కొత్త సినిమాతో కూడా ఓ సాంగ్ తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నాడు.

ఈ ప్రాజెక్టుకు దిల్ రాజు నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై చరణ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీ రిలీజ్ తర్వాత తన రేంజ్ మారిపోతుందని భావిస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేయలేదు. గౌతమ్ తిన్ననూరి మూవీని కూడా రిజెక్ట్ చేశాడు.

First Published:  17 Nov 2022 4:30 AM GMT
Next Story