Telugu Global
Cinema & Entertainment

లైగర్ నుంచి మరో థీమ్ సాంగ్

లైగర్ నుంచి మరో సాంగ్ వచ్చింది. ఈసారి తెలుగు-హిందీ అనే బేధం లేదు. అన్ని భాషల్లో ఒకటే సాంగ్.. వినేయండి

లైగర్ నుంచి మరో థీమ్ సాంగ్
X

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న సినిమా ''లైగర్''. ఈ సినిమాతో మాజీ బాక్సర్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ కు పరిచయమౌతున్నాడు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ చిత్రంపై భారీ హైప్, అంచనాలను పెంచింది. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ సింగిల్ ' అక్డీ పక్డీ ' వైరల్‌గా మారి మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇదే ఊపులో 'వాట్ లాగా దేంగే' అనే థీమ్ సాంగ్ ను విడుదల చేసింది.

ఈ థీంమ్ సాంగ్ హీరో స్వాగ్, యాటిట్యుడ్ ని ఆవిష్కరించింది. స్లమ్‌డాగ్ నుండి ఎంఎంఏ ఫైటర్ గా దేశానికి ప్రాతినిధ్యం వహించే జర్నీని చూపించింది.

పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.



First Published:  30 July 2022 5:15 AM GMT
Next Story