Telugu Global
Cinema & Entertainment

లైగర్ నుంచి మరో సాంగ్.. ఈసారి కోక పాట

లైగర్ నుంచి మరో సాంగ్ రిలీజైంది. ఈసారి మంచి డీజే బీట్ ను రిలీజ్ చేశారు

లైగర్ నుంచి మరో సాంగ్.. ఈసారి కోక పాట
X

విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్'. ఇప్పుడీ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజైంది. కోకా 2.0 అనే పాటను రిలీజ్ చేశారు. డీజే స్టయిల్ లో, బాలీవుడ్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేసిన పాటలా ఉందిది.

లిజో జార్జ్-డిజె చేతస్ కంపోజ్ చేసిన ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హిపాప్ మూమెంట్స్ తో అదరగొట్టారు. ఆకట్టుకునే డ్రెస్సింగ్, కళ్లుచెదిరే సెట్, కొరియోగ్రఫీ.. ఇలా ప్రతిది డిఫరెంట్ గా ఉంది. గాయని గీతా మాధురితో కలిసి ఈ ఫాస్ట్ బీట్ నంబర్‌ని పాడిన రామ్ మిరియాల, తన మార్క్ చూపించాడు. భాస్కరభట్ల సాహిత్యం అందించాడు.

పాటలో ప్రత్యేకమైన అంశం ఏంటంటే.. విజయ్ దేవరకొండ వేసిన భాంగ్రా స్టెప్పులు. అతడు ఈ టైపు డాన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ పాటలో దర్శకుడు పూరీ జగన్నాధ్ కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, లైగర్ యూనిట్ దేశంలోని వివిధ నగరాల్లో ప్రమోషనల్ టూర్‌లో ఉన్నారు. ప్రతి ఈవెంట్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 14న వరంగల్‌ హనమకొండలోని సుబేదారి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో లైగర్ భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు.

పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది.



First Published:  12 Aug 2022 2:01 PM GMT
Next Story