Telugu Global
Cinema & Entertainment

Dhamaka: మరో సాంగ్ వస్తోంది.. హైప్ మాత్రం లేదు

Raviteja's Dhamaka movie: రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు కానీ మూవీ కి హైప్ మాత్రం రావడం లేదు.

Dhamaka: మరో సాంగ్ వస్తోంది.. హైప్ మాత్రం లేదు
X

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ధమాకా. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా నుంచి వరుసపెట్టి సాంగ్స్ వస్తున్నాయి. భారీగా ప్రచారం చేస్తున్నట్టు మేకర్స్ ఫీల్ అవుతున్నారు. కానీ ఆ సాంగ్స్ తో సినిమాకు ఎలాంటి హైప్ రావడం లేదు. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ పాటలు మినిమం గ్యాప్స్ లో ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయంతే


ధమాకా నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదల చేసిన పాటకు మాత్రమే ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన పాటలేవీ క్లిక్ అవ్వలేదు. అయినప్పటికీ మేకర్స్ మాత్రం తగ్గడం లేదు. తమ షెడ్యూల్ ప్రకారం సాంగ్స్ రిలీజ్ చేసుకుపోతున్నారు. 25వ తేదీకి మరో సాంగ్ షెడ్యూల్ పెట్టారు.


డుడు అనే లిరిక్స్ తో సాంగే ఈ పాటను 25వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ప్రోమోలో రవితేజ చేసిన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్ కనిపించింది తప్ప, క్యాచీ బీట్ మాత్రం అనిపించలేదు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.


రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. డిసెంబర్ 23న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

First Published:  23 Nov 2022 11:40 AM GMT
Next Story