Telugu Global
Cinema & Entertainment

కార్తికేయకు మరో సీక్వెల్ కూడా రెడీగా ఉంది

కార్తికేయ సినిమాకు మరో సీక్వెల్ తీస్తానంటున్నాడు దర్శకుడు చందు మొండేటి. తన దగ్గర చెప్పాల్సింది ఇంకా చాలా ఉందంటున్నాడు.

కార్తికేయకు మరో సీక్వెల్ కూడా రెడీగా ఉంది
X

కార్తికేయ-2 మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. అయితే ఇప్పుడీ సినిమాకు మరో సీక్వెల్ కూడా సిద్ధంగా ఉందని ప్రకటించాడు దర్శకుడు చందు మొండేటి.

"నేను ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఆడియన్స్ కార్తికేయ-2ను రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి సీక్వెల్ ప్లాన్ చేస్తాను. సీక్వెల్ కు సంబంధించి నా దగ్గర ఐడియా సిద్ధంగా ఉంది. కార్తికేయ-2 హిట్టయితే, కచ్చితంగా కార్తికేయ-3 కూడా వస్తుంది. అంత స్పాన్ ఉన్న సబ్జెక్ట్ ఇది."

ఈ సందర్భంగా తన అప్ కమింగ్ మూవీస్ కూడా బయటపెట్టాడు చందు మొండేటి. తన దగ్గర రెండు కథలు సిద్ధంగా ఉన్నాయన్నాడు. అంతేకాదు, ఆ 2 కథలకు గ్రీన్ సిగ్నల్స్ కూడా వచ్చేశాయని చెబుతున్నాడు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై త్వరలోనే ఓ సినిమా ఉంటుందని, అలాగే నాగార్జున హీరోగా మరో సినిమా ఉంటుందని స్పష్టంచేశాడు.

కరోనా లేకపోతే ఈ 2 సినిమాలు ఈపాటికే సెట్స్ పైకి వచ్చి ఉండేవని, కరోనా వల్ల తన కెరీర్ కాస్త స్లో అయిందని చెప్పుకొచ్చాడు. అంతేతప్ప, తనకు అవకాశాలు రావడం లేదనే పుకారులో నిజం లేదని స్పష్టంచేశాడు చందు మొండేటి.

First Published:  11 Aug 2022 3:19 AM GMT
Next Story