Telugu Global
Cinema & Entertainment

సిద్ శ్రీరామ్ నుంచి మరో మెలొడీ

తన గాత్రంతో పాటకు ఓ మత్తు తీసుకొస్తాడు సింగర్ సిద్ శ్రీరామ్. ఇప్పుడీ సింగర్ నుంచి మరో మెలొడీ వచ్చింది. కృష్ణమ్మ సినిమా నుంచి ఆ పాట రిలీజైంది.

సిద్ శ్రీరామ్ నుంచి మరో మెలొడీ
X

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ దక్కించుకున్న హీరో సత్యదేవ్. ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'కృష్ణ‌మ్మ‌'. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మ‌ల‌పాటి.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే మూవీని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

కాల భైర‌వ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నుంచి కొత్త సాంగ్ రిలీజైంది. 'ఏమ‌వుతుందో మ‌న‌లో..' అనే మెలోడి సాంగ్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ పాడారు. పాట‌ను గ‌మ‌నిస్తే ప్రేమ‌లో గాఢ‌త‌ను తెలియ‌జేసేలా ఉంది. మ‌న‌సులోని భావాల‌ను ప్రేమికులు బ‌య‌ట‌కు వ్య‌క్తం చేయ‌లేన‌ప్పుడు మ‌న‌సుల‌తో ఊసులాడుకుంటార‌నేలా హ‌వభావాల‌ను చ‌క్క‌టి ప‌దాల‌తో వ్య‌క్తం చేశారు. పాట మ‌న‌సుకి హ‌త్తుకుంటోంది. స‌న్ని కూరపాటి విజువ‌ల్స్ పాట‌కు మ‌రింత అందాన్ని తెచ్చిపెట్టాయి.

రీసెంట్‌గా విడుద‌లైన 'కృష్ణ‌మ్మ‌' సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. టీజర్ చూస్తే రివెంజ్ డ్రామా అనిపిస్తోంది. వరుసగా ఫెయిల్యూర్స్ చూస్తున్న ఈ నటుడు, కృష్ణమ్మపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.



First Published:  20 Aug 2022 3:33 AM GMT
Next Story