Telugu Global
Cinema & Entertainment

శ్రీసింహా నుంచి మరో కాన్సెప్ట్ మూవీ

హీరో శ్రీసింహా నుంచి మరో కాన్సెప్ట్ సినిమా రెడీ అయింది. దీని పేరు భాగ్ సాలే. ఫస్ట్ లుక్ ఎలా ఉందో చూడండి.

శ్రీసింహా నుంచి మరో కాన్సెప్ట్ మూవీ
X

వరుసపెట్టి కాన్సెప్ట్ మూవీస్ చేస్తున్నాడు హీరో శ్రీసింహా. రీసెంట్ గా దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమా చేశాడు. అయితే థియేటర్లలో ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరో కాన్సెప్ట్ మూవీ సిద్ధం చేశాడు. ఈసారి భాగ్ సాలే అనే సినిమాతో థియేటర్లలోకి వస్తున్నాడు. దొంగలున్నారు జాగ్రత్త సినిమా కారు చుట్టూ తిరిగితే, భాగ్ సాలే సినిమా ఓ ఉంగరం చుట్టూ తిరుగుతుంది.

ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్

బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ విలన్ ఉంటుంది. ఆ లేడీ విలన్ పాత్రను నందిని రాయ్ పోషించింది.

ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఓ యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథలో అడుగడుగునా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

ఇందులో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతం అందించాడు. సినిమా షూట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.




First Published:  8 Oct 2022 6:20 AM GMT
Next Story