Telugu Global
Cinema & Entertainment

మరో బయోపిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండియన్ సినిమాకు బయోపిక్స్ కొత్త కాదు. ఇప్పుడు అదే బాటలో మరో బయోపిక్ వస్తోంది. ఈసారి మిథాలీ రాజ్ వంతు.

మరో బయోపిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్
X

ఇండియన్ స్క్రీన్ పైకి మరో బయోపిక్ వస్తోంది. దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం "శభాష్ మిథు". ఈ సినిమాలో తాప్సీ, మిథాలీ రాజ్ పాత్రను పోషించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన మిథాలీ రాజ్, వన్డేల్లో 10వేల పరుగులకు పైగా చేసింది. ఈ చిత్రంలో ఆమె లెజెండరీ క్రికెటర్‌గా మారే ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను చూపించనున్నాడు దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ.

ప్రస్తుతం శభాష్ మిథు రిలీజ్ కు రెడీ గా ఉంది, జులై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధిన ప్రొమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాప్సీ తో పాటు క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా ఈ ప్రొమోషన్స్ లో పాల్గొంటోంది. రీసెంట్ గా ఆమె క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదివరకే భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు. "శభాష్ మిథు" ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జూలై 15న విడుదలకానుంది.





First Published:  14 July 2022 10:15 AM GMT
Next Story