Telugu Global
Cinema & Entertainment

Om Bheem Bush | ఆ ముగ్గురు మళ్లీ కలిశారు

Om Bheem Bush - శ్రీవిష్ణు కొత్త సినిమా ఓం భీమ్ బుష్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Om Bheem Bush | ఆ ముగ్గురు మళ్లీ కలిశారు
X

'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఓ క్రేజీ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఓం భీమ్ బుష్' అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఖరారు చేశారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది.

ప్రీ-లుక్ గ్లింప్స్‌తో దృష్టిని ఆకర్షించిన మేకర్స్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ముందుకు వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు తమ చేతుల్లో పేలుడు పరికరాలతో అంతరిక్ష నౌకతో భూమిపైకి వస్తున్నట్టు గ్లింప్స్ చూపించింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ రూరల్ ఏరియాలో చేతిలో కొన్ని పామ్ ప్లేట్స్ తో స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్నారు. వీరంతా వ్యోమగామి దుస్తులను ధరించారు. ఫస్ట్ లుక్ క్రేజీగా ఉంది.

శ్రీ విష్ణు కామెడీ యూనిక్ గా ఉంటుంది. అతని గత చిత్రం సామజవరగమన అంత సక్సెస్ అయిందంటే, శ్రీవిష్ణు కామెడీనే కారణం. ఇక ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే.

'ఓం భీమ్ బుష్' అనేది తాంత్రిక విద్యలో జపించే మంత్రం, పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా సరదా చెబుతుంటారు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనేది ఈ సినిమా క్యాప్షన్. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయబోతున్నారు.

First Published:  22 Feb 2024 5:27 PM GMT
Next Story