Telugu Global
Cinema & Entertainment

Prabhas Salaar - మళ్లీ మొదటికొచ్చిన పుకారు

Prabhas Salaar - ప్రభాస్ సలార్ సినిమాపై గతంలో కొన్ని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అవే పుకార్లు మళ్లీ రిపీట్ అయ్యాయి.

Prabhass Salaar Movie: మరో నెల రోజుల్లో సలార్ పూర్తి
X

Prabhas's Salaar Movie: మరో నెల రోజుల్లో సలార్ పూర్తి

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. శృతిహాసన్ హీరోయిన్.

ఇదిలా ఉండగా, సలార్ రెండు భాగాలుగా రాబోతోందనే ప్రచారం చాన్నాళ్ల కిందటే మొదలైంది. అంతా దానికే ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ సినిమా 2 భాగాలుగా రావడం లేదని, సింగిల్ మూవీగానే వస్తోందంటూ మరో ఊహాగానం వచ్చింది. దీంతో అదే నిజం అనుకున్నారు చాలామంది.

ఇప్పుడు లేటెస్ట్ గాసిప్ ఏంటంటే.. సలార్ సినిమా 2 భాగాలుగానే వస్తుందట. మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందట. రెండో భాగం షూటింగ్ ను మాత్రం ఇప్పట్లో స్టార్ట్ చేయరంట.

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అది పూర్తయిన తర్వాత సలార్-2 స్టార్ట్ అవుతుందంటూ తాజాగా మరో పుకారు ఊపందుకుంటుంది. ఓవైపు ఇంత జరుగుతుంటే, అటు మేకర్స్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆశ్చర్యకరం.

First Published:  13 Feb 2023 5:06 PM GMT
Next Story