Telugu Global
Cinema & Entertainment

ఒకే ఒక జీవితం.. హాఫ్ మిలియన్ మార్క్

ఓవర్సీస్ లో ఒకే ఒక జీవితం స్టడీగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్క్ అందుకుంది.

ఒకే ఒక జీవితం.. హాఫ్ మిలియన్ మార్క్
X

శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. ఈ సినిమా హిట్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ, వసూళ్లలో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ మార్క్ అందుకుంది. దాదాపు విడుదలైన 2 వారాలకు ఈ సినిమా ఓవర్సీస్ లో 5 లక్షల డాలర్లు సంపాదించగలిగింది.

అయితే సినిమాలన్నీ వచ్చిన 3 రోజులకే దుకాణం సర్దేస్తున్న టైమ్ లో ఒకే ఒక జీవితం సినిమా ఇన్ని రోజుల పాటు స్టడీగా నిలబడడం చెప్పుకోదగ్గ విశేషం. ఓవర్సీస్ తో పాటు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు నిలకడగా వసూళ్లు వస్తున్నాయి. కలెక్షన్లు తక్కువగానే ఉన్నప్పటికీ, యావరేజ్ ఆక్యుపెన్సీతో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

విడుదలైన 9 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ప్రస్తుతం ఏపీ,నైజాంలోని ప్రతి సెంటర్ లో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు లాభాలు చూస్తున్నారు.

శ్రీకార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. శర్వా అమ్మగా అమల నటించగా, రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. సైన్స్ ఫిక్షన్ కు మదర్ సెంటిమెంట్ యాడ్ చేసి తీసిన ఈ సినిమా అందర్నీ మెప్పించింది.

First Published:  20 Sep 2022 3:48 AM GMT
Next Story