Telugu Global
Cinema & Entertainment

ఒకే ఒక జీవితం మొదటి వారాంతం వసూళ్లు

నిన్నటితో మొదటి వారాంతం పూర్తి చేసుకుంది ఒకే ఒక జీవితం సినిమా. శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీ, విడుదలైన ఈ 3 రోజుల్లో సూపర్ హిట్ టాక్ సంపాదించింది.

ఒకే ఒక జీవితం మొదటి వారాంతం వసూళ్లు
X

శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది ఒకే ఒక జీవితం సినిమా. రోజురోజుకు ఈ సినిమాకు వసూళ్లు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా నిన్న ఆదివారం రోజున ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అలా మొదటి వారాంతానికి ఈ సినిమా 3 కోట్ల 22 లక్షల రూపాయల షేర్ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 7 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. తాజా వసూళ్ల ప్రకారం ఈ మూవీ సగం బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో, ఇకపై ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఈజీ. అంతేకాదు, మంచి లాభాలు కూడా అందుకునే అవకాశం ఉంది.

శర్వానంద్, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శ్రీకార్తీక్ దర్శకత్వం వహించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో నాజర్ కీలక పాత్ర పోషించాడు. విడుదలైన ఈ 3 రోజుల్లో ఒకే ఒక జీవితం సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం - 1.65 కోట్లు

సీడెడ్ - 24 లక్ష

ఉత్తరాంధ్ర - 33 లక్షలు

ఈస్ట్ - 23 లక్షలు

వెస్ట్ - 18 లక్షలు

గుంటూరు - 24 లక్షలు

నెల్లూరు - 14 లక్షలు

కృష్ణా - 21 లక్షలు

First Published:  12 Sep 2022 11:27 AM GMT
Next Story