Telugu Global
Cinema & Entertainment

OG Movie | ఓజీ విలన్ వచ్చేశాడు

OG Movie - పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా నుంచి ఇమ్రాన్ హస్మి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

OG Movie | ఓజీ విలన్ వచ్చేశాడు
X

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయి చాలా కాలమైంది. ఏపీ రాజకీయాల్లో, ఎన్నికలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, ఓజీ సినిమాతో పాటు అన్ని ప్రాజెక్టుల్ని పక్కనపెట్టేశాడు. అయితే యూనిట్ మాత్రం ఓజీ ప్రచారాన్ని ఆపలేదు.

ఎప్పటికప్పుడు ఈ సినిమా నుంచి అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి విలన్ లుక్ ను రిలీజ్ చేశారు. ఓజీ సినిమాలో పవన్ కు విలన్ గా ఇమ్రాన్ హస్మి నటిస్తున్నాడు. ఆయన లుక్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఓజీ సినిమాలో స్టయిలిష్ విలన్ గా కనిపిస్తున్నాడు ఇమ్రాన్ హస్మి. అతడికి ఇదే తొలి తెలుగు సినిమా.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా చేతులు మారిందంటూ కొన్ని రోజులు కిందట కథనాలు వచ్చాయి. డీవీవీ బ్యానర్ నుంచి పీపుల్ మీడియా బ్యానర్ ఈ సినిమాను భారీ రేటుకు దక్కించుకున్నట్టు పుకార్లు వినిపించాయి.

వీటిని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ కొట్టిపారేసింది. "ఓజీ సినిమా మాది. ఆ సినిమా ఎప్పటికీ మాదే" అంటూ ప్రకటన విడుదల చేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు.




First Published:  24 March 2024 10:05 AM GMT
Next Story