Telugu Global
Cinema & Entertainment

అఫీషియల్: రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్

Varun Tej Engagement: వరుణ్ లావణ్యల ఎంగేజ్మెంట్ రేపు సాయంత్రం హైదరాబాద్ లో జరుగనుంది. వరుణ్ తేజ్ ఇంట్లో వేడుకకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అఫీషియల్: రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్
X

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, యంగ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం జరుగనుంది. ఈ మేరకు వరుణ్ తేజ్ టీం, మెగా అభిమాన సంఘాలు అఫీషియల్ గా ప్రకటించాయి. ఎంగేజ్మెంట్ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వరుణ్ తేజ్, లావణ్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలో నటించారు. ఆ సినిమా ప్లాప్ గా నిలిచినప్పటికీ షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వరుణ్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో అంతరిక్షం సినిమా వచ్చింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను అటు వరుణ్ కానీ ఇటు లావణ్య కానీ ఖండించలేదు.

ఇక వారం కిందట వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ జూన్ 9వ తేదీన జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. వరుణ్ లావణ్యల ఎంగేజ్మెంట్ రేపు సాయంత్రం హైదరాబాద్ లో జరుగనుంది. వరుణ్ తేజ్ ఇంట్లో వేడుకకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ నిశ్చితార్థం జరుపనున్నట్లు తెలుస్తోంది.

First Published:  8 Jun 2023 10:17 AM GMT
Next Story