Telugu Global
Cinema & Entertainment

Dhanush Sekhar Kammula | ఆగిందనుకున్న సినిమాపై అధికారిక ప్రకటన

Dhanush Sekhar Kammula Movie - ఎట్టకేలకు ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఆగిపోలేదు.

Dhanush Sekhar Kammula | ఆగిందనుకున్న సినిమాపై అధికారిక ప్రకటన
X

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. అప్పట్లో ఫొటోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఆ వెంటనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేశాడు ధనుష్. ఆ మూవీ రిలీజ్ కూడా అయింది. దీంతో శేఖర్ కమ్ముల సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది.

అలా చాన్నాళ్లుగా సైడ్ అయిపోయిన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు తిరిగి లైమ్ లైట్లోకి వచ్చింది. ధనుష్, శేఖర్ కమ్ముల చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటు ధనుష్, అటు కమ్ముల ఇద్దరూ జాతీయ అవార్డు గ్రహీతలే కావడం విశేషం.

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లోని ఈ క్రేజీ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ నిర్మించనున్నారు. శేఖర్ కమ్ముల కూడా సహ-నిర్మాతగా వ్యవహరిస్తాడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తారు.

సినిమా ప్రకటనలో భాగంగా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ పెద్ద నగరం, అందులో ఓ మురికివాడ, దానిపైన డబ్బు కట్టలు పెట్టి, ఆసక్తికరంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.. సంగీత దర్శకుడు ఎవరనే విషయాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.

First Published:  28 July 2023 5:15 PM GMT
Next Story