Telugu Global
Cinema & Entertainment

Nushrratt Bharuccha | ఇజ్రాయెల్ లో చిక్కుకున్న హీరోయిన్ సేఫ్

Nushrratt Bharuccha - ఇజ్రాయెల్ లో చిక్కుకున్న బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా, సురక్షితంగా ఇండియాకు చేరుకుంది. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించింది.

Nushrratt Bharuccha | ఇజ్రాయెల్ లో చిక్కుకున్న హీరోయిన్ సేఫ్
X

ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయి, తన బృందంతో సంబంధాలు కోల్పోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా సురక్షితంగా ఉన్నారు. ఎట్టకేలకు బృందం ఆమెను సంప్రదించి సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చింది. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ వెళ్లింది. అయితే ఆ దేశానికి, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆమె కనిపించకుండా పోయింది. ఆమె బృందంతో కమ్యూనికేషన్ కూడా తెగిపోవడంతో చాలామంది ఆందోళనకు గురయ్యారు.

ఆమెను వెతకడానికి టీమ్ తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి, ఆమెను కనుగొన్నారు. అయితే భారత్‌కు నేరుగా విమానం లేకపోవడంతో ఆమె కనెక్టింగ్ ఫ్లైట్‌లో ఇంటికి చేరుకుంది. ముంబై ఎయిర్‌ పోర్టులో దిగిన వెంటనే, నుష్రత్ తో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించగా, ఆమె నిరాకరించింది.

హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నుష్రత్ భరుచ్చా కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్ వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, హమాస్ గ్రూపు వేలాది రాకెట్లను ప్రయోగించడంతో.. ఇజ్రాయెల్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ కారణంగా, నుష్రత్ ఆమె జట్టు నుండి విడిపోయింది. అయితే, ఆమె శనివారం మధ్యాహ్నం ఒక ప్రదేశం నుండి చివరి కాల్ చేసింది. తాను అందరితో పాటు నేలమాళిగలో సురక్షితంగా ఉన్నానని చెప్పింది. ఆ తర్వాత తన టీమ్ తో సంబంధాలు కోల్పోయింది. చివరి కాల్ తర్వాత 24 గంటల్లో ఆమెను టీమ్ కనుగొంది. వెంటనే ఇండియాకు తీసుకొచ్చింది.

నుష్రత్ రాకతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. బాలీవుడ్ తో పాటు తెలుగుతో కలిపి 30కి పైగా సినిమాలు చేసింది నుష్రత్. బాలీవుడ్ లో ఆమెకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి హీరోయిన్ ఇజ్రాయెల్ లో అత్యంత భయంకరమైన అనుభవాన్ని చవిచూసింది. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది.

First Published:  9 Oct 2023 2:02 AM GMT
Next Story