Telugu Global
Cinema & Entertainment

NTR Look: వైరల్ పిక్ పై క్లారిటీ ఇదే!

ఎన్టీఆర్ కు సంబంధించి ఓ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మేకోవర్ దేనికోసం..?

NTR Look: వైరల్ పిక్ పై క్లారిటీ ఇదే!
X

ఎన్టీఆర్-కొరటాల సినిమాపై అందరి కన్ను ఉంది. దీనికి సంబంధించి తాజాగా మేకర్స్ ప్రకటన చేశారు కూడా. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశారు. ప్రస్తుతం లొకేషన్ వేటలో కొరటాల ఉన్నాడు. మరోవైపు అనిరుధ్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుపుతున్నాడు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ కొత్త ఫొటో బయటకొచ్చింది.

స్టయిలిష్ లుక్ లో మేకోవర్ అయిన తారక్ ఫొటో నిన్నట్నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీంతో అంతా ఇది ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం మేకోవర్ అనుకున్నారు. కానీ అది నిజం కాదు.

కొరటాల శివ సినిమా కోసం తారక్ రెడీ అవుతున్న సంగతి నిజమే. కానీ ఈ లుక్ మాత్రం ఆ సినిమా కోసం కాదు. ఓ యాడ్ ఫిలిం షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఇలా కొత్తగా ముస్తాబయ్యాడు. అంతేతప్ప, కొరటాల శివ సినిమాకు, ఈ లుక్ కు ఎలాంటి సంబంధం లేదు.

నిజానికి కొరటాల శివ సినిమాలో కూడా ఎన్టీఆర్ గడ్డంతోనే కనిపించబోతున్నాడు. అయితే కళ్లజోడు ఉంటుందా ఉండదా, హెయిల్ స్టయిల్ ఎలా ఉంటుందనే అంశాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 15 కిలోల బరువు తగ్గాడు.




First Published:  12 Nov 2022 3:57 AM GMT
Next Story