Telugu Global
Cinema & Entertainment

Devara | ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

Devara - కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమా షూట్ గోవాలో జరుగుతోంది.

Devara | ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ పార్ట్ 1. ఈ యాక్షన్ డ్రామాతో తనదైన మాస్ అవతార్‌లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటానికి తారక్ సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

దేవర ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ చూడటానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ కొత్త షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడ కొన్ని షెడ్యూల్స్ పూర్తిచేశారు. ఇప్పుడు మరోసారి అక్కడికే వెళ్లారు. ఈ నేపథ్యంలో సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది.

దేవర మేకర్స్ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్‌ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీలో ఈ చిత్రానికి సంబంధించిన మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఎన్టీఆర్‌ను సరికొత్త పాత్రలో చూడటానికి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల ‘దేవర’ పార్ట్ 1 గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా ఇండియా రేంజ్‌లో అది ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమాలోనే ఎక్కువమంది చూసిన గ్లింప్స్‌గా అది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాక్కో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  24 March 2024 9:43 AM GMT
Next Story