Telugu Global
Cinema & Entertainment

NTR | వార్-2 స్టార్ట్ చేసిన యంగ్ టైగర్

NTR WAR 2 - ఎట్టకేలకు తన తొలి బాలీవుడ్ సినిమా స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్. రంజాన్ పర్వదినాన వార్-2 షూటింగ్ స్టార్ట్ చేశాడు.

NTR | వార్-2 స్టార్ట్ చేసిన యంగ్ టైగర్
X

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్టీఆర్, వార్-2 షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. దీని కోసం ముంబయిలో ల్యాండ్ అయిన ఎన్టీఆర్, అట్నుంచి అటు లొకేషన్ కు వెళ్లాడు. వార్-2 కోసం తారక్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీశారు.

హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ సినిమా పెద్ద హిట్టయింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ సినిమాకు సీక్వెల్ గా వార్-2 వస్తోంది. వార్ లో టైగర్ ష్రాఫ్ కీలక పాత్ర పోషించగా.. వార్-2 కోసం ఎన్టీఆర్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో గూఢచారిగా కనిపించబోతున్నాడు ఎన్టీఆర్.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హృతిక్ రోషన్ ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చాడు. తాజాగా ఎన్టీఆర్ రాకతో సినిమా షూటింగ్ పరుగులు పెట్టబోతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా కోసం దేవర సినిమాను పాక్షికంగా పక్కనపెట్టాడు ఎన్టీఆర్. వార్-2 షెడ్యూల్ పూర్తయిన వెంటనే, తిరిగి దేవర సెట్స్ పైకి వస్తాడు. అక్టోబర్ 10న దేవర పార్ట్-1 రిలీజ్ కానుంది. ఇక వార్-2 సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ నుంచి దేవర-2 కూడా వస్తుంది.

First Published:  11 April 2024 4:01 PM GMT
Next Story