Telugu Global
Cinema & Entertainment

NTR: తనపై జరిగిన ట్రోలింగ్ కు ఎన్టీఆర్ సమాధానం ఇది

NTR reacts to his English accent - గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ లో ఎన్టీఆర్ మాట్లాడిన ఇంగ్లిష్ పై విమర్శలొచ్చాయి. ఆ కామెంట్స్ కు ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడు.

NTR: తనపై జరిగిన ట్రోలింగ్ కు ఎన్టీఆర్ సమాధానం ఇది
X

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకల కోసం అమెరికా వెళ్లింది ఆర్ఆర్ఆర్ యూనిట్. రాజమౌళి తోపాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే అంతా బాగున్నప్పటికీ, ఎన్టీఆర్ పై మాత్రం కొన్ని విమర్శలు చెలరేగాయి. అమెరికాకు వెళ్లిన తర్వాత యూఎస్ యాసలో మాట్లాడ్డానికి ఎన్టీఆర్ ప్రయత్నించాడు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ యాసపై ఇండియాలో విమర్శలు చెలరేగాయి. అమెరికా వెళ్లినంతమాత్రాన, అమెరికన్ లా మాట్లాడాల్సిన అవసరం లేదని, ఇండియన్ లా మాట్లాడితే ఎవ్వరూ ఏం అనరంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడ్డాయి. ఈ ట్రోలింగ్ ఎన్టీఆర్ వరకు వచ్చింది. దీనిపై ఈ నటుడు స్పందించాడు.

"ఒక్కో దేశంలో ఒక్కో యాస ఉంటుంది. కాలం, ప్రదేశం బట్టి యాస మారుతుంది. ఇక నా యాస విషయానికొస్తే.. వెస్ట్రన్ కంట్రీస్ లో ఓ నటుడు ఎలాంటి డ్రెస్సింగ్, మాటతీరు చూపిస్తాడో.. దాదాపు తూర్పు దేశాలన్నీ దాన్ని అనుకరిస్తాయి. ఇందులో తప్పు లేదు."

ఇలా తన ఇంగ్లిష్ యాసను సమర్థించుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు క్రిటిక్ ఛాయిస్ అవార్డులు దక్కడంపై ఈ నటుడు ఆనందం వ్యక్తం చేశాడు.

First Published:  19 Jan 2023 3:24 PM GMT
Next Story