Telugu Global
Cinema & Entertainment

Shooting Updates | ఏ సినిమా ఎక్కడ?

Shooting Updates - విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పుడెక్కడున్నారు.. ఏం చేస్తున్నారు..?

Shooting Updates | ఏ సినిమా ఎక్కడ?
X

శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. దిల్ రాజు నిర్మాత. ఓవైపు దిల్ రాజు తన తండ్రిని కోల్పోయినప్పటికీ, ఈ సినిమా షూటింగ్ మాత్రం ఆగలేదు. ప్రస్తుతం గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్, సునీల్ తో పాటు మరికొంతమంది ఆర్టిస్టులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

దేవర పార్ట్-1 షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ నిరాటంకంగా సాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి తారక్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమాతో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ తెలుగుతెరకు పరిచయమౌతోంది. జాన్వి కపూర్ హీరోయిన్.

గీతగోవిందం కాంబో విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ విల్లాలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

నాగార్జున హీరోగా తెరకెక్కుతోంది నా సామిరంగ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. బెజవాడ ప్రసన్నకుమార్ కథ-డైలాగ్స్ అందిస్తున్నాడు. కీరవాణి సంగీత దర్శకుడు.

First Published:  14 Oct 2023 8:28 AM GMT
Next Story