Telugu Global
Cinema & Entertainment

NTR, Ramcharan - ఆర్ఆర్ఆర్ హీరోల మధ్య వార్ తప్పదా?

NTR, Ramcharan movies - RRR లో కలిసి నటించిన తారక్, చరణ్.. వచ్చే ఏడాది బాక్స్ ఆఫీసు బరిలో పోటీపడబోతున్నారా?

NTR, Ramcharan - ఆర్ఆర్ఆర్ హీరోల మధ్య వార్ తప్పదా?
X

ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించారు రామ్ చరణ్, ఎన్టీఆర్. బయట కూడా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. నిన్నటికినిన్న చరణ్, తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటే, ఎన్టీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఇలాంటి ఇద్దరు హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో పోటీ పడబోతున్నారు.


కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.


ఇక రామ్ చరణ్ కూడా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని ఈ ఏడాది విడుదల చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేద్దామంటే, ఆల్రెడీ ప్రభాస్-మహేష్ సినిమాలున్నాయి.


దీంతో గేమ్ ఛేంజర్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలనుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్-చరణ్ సినిమాలు ఒకే సీజన్ లో, ఒక వారం గ్యాప్ లో థియేటర్లలో పోటీపడతాయనే ప్రచారం సాగుతోంది.


అయితే చాలామంది ట్రేడ్ ఎనలిస్టులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు పోటీ పడే అవకాశం ఉండొచ్చు కానీ, మిగతా సీజన్లలో 2 పెద్ద సినిమాలు ఒకే టైమ్ కు రావని, పోటీ ఉండదని చెబుతున్నారు.

First Published:  28 March 2023 10:10 AM GMT
Next Story