Telugu Global
Cinema & Entertainment

NTR-Koratala: ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో రావాల్సిన సినిమా పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి

NTR-Koratala: ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్
X

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లో నలుగుతూనే ఉంది ఈ ప్రాజెక్టు. జనతా గ్యారేజ్ వంటి సక్సెస్‌పుల్ మూవీ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే ఇప్పటివరకు ఈ సినిమా అప్ డేట్ రాలేదు. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలియదు. ఇలాంటి టైమ్ లో కీలక ప్రకటన చేశారు మేకర్స్. ప్రస్తుతం కొరటాల శివ తన టీమ్‌తో కలిసి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌లతో కలిసి ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని అందించటానికి సిద్ధమవుతున్నాడు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రేక్షకులను మెప్పించేలా రూపొందున్న ఈ పవర్ ఫుల్ సబ్జెక్ట్‌పై యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ పాన్ ఇండియా మూవీకి యువ సంగీత సంచలనం అనిరుధ్ సంగీతాన్ని అందించబోతున్నాడు.

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొరటాల శివకు సన్నిహితుడైన మిక్కినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

First Published:  7 Nov 2022 4:02 AM GMT
Next Story