Telugu Global
Cinema & Entertainment

Jr NTR - తన కొత్త సినిమాపై అప్ డేట్స్ ఇచ్చిన ఎన్టీఆర్

NTR30 - తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇచ్చాడు తారక్. ఈ నెలలోనే ఓపెనింగ్ ఉంటుదని చెప్పాడు.

Jr NTR - తన కొత్త సినిమాపై అప్ డేట్స్ ఇచ్చిన ఎన్టీఆర్
X

ఆర్ఆర్ఆర్ లాంటి మాసివ్ సక్సెస్ తర్వాత కొరటాల డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. కెరీర్ లో 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. తాజాగా రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.


కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. దీంతో మేకర్స్ పై సోషల్ మీడియాలో ఒత్తిడి తెస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అప్ డేట్స్ ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.


తాజాగా ఈ విషయంపై రియాక్ట్ అవుతూ ఫ్యాన్స్ కి అప్ డేట్స్ అందించే ప్రయత్నం చేశాడు ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన తారక్, ఫ్యాన్స్ కి షూటింగ్ అప్ డేట్స్ చెప్పాడు. ఈ నెలలోనే సినిమా పూజా కార్యక్రమాలతో మొదలవుతుందని ప్రకటించిన ఎన్టీఆర్.. మార్చ్ 20 లేదా అంతకంటే ముందే సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చాడు.


ఇకపై అప్ డేట్స్ గురించి ప్రొడక్షన్ హౌజ్ పై ఒత్తిడి తీసుకురావొద్దని ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశాడు తారక్ . ఏదైనా అప్ డేట్ ఉంటే తన భార్య కంటే ముందే ఫ్యాన్స్ తో పంచుకుంటానని తెలిపాడు.

First Published:  6 Feb 2023 11:17 AM GMT
Next Story