Telugu Global
Cinema & Entertainment

జపాన్ ను కూడా వదలని జక్కన్న

మనందరి దృష్టిలో ఆర్ఆర్ఆర్ మేనియా ముగిసింది. కానీ రాజమౌళికి మాత్రం ఇంకా ఆర్ఆర్ఆర్ పని మిగిలే ఉంది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతోంది. దీనికోసం రాజమౌళి ప్రచారంలో పాల్గొంటున్నాడు.

జపాన్ ను కూడా వదలని జక్కన్న
X

మేకింగ్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటాడో, ప్రమోషన్ విషయంలో కూడా అంతే సీరియస్ గా ఉంటాడు దర్శకుడు రాజమౌళి. పెర్ ఫెక్షన్ కోసం తీసిన షాట్ నే పదే పదే తీసే రాజమౌళి, ప్రచారం విషయంలో కూడా అంతే ఓపిగ్గా ఉంటాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇది మరోసారి ప్రూవ్ అయింది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు భారీ ప్రచారం చేశారు. ఆ హంగామా ముగిసింది. సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఓవర్సీస్ లో హంగామా కూడా ముగిసింది. ఈ టైమ్ లో కావాలంటే రాజమౌళి రిలాక్స్ అవ్వొచ్చు. కానీ ఈ దర్శకుడు, రెస్ట్ తీసుకోవడం లేదు.

ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో విడుదలకు సిద్ధమైంది. అక్కడ రిలీజ్ కోసం ఫ్రెష్ గా ప్రచారం స్టార్ట్ చేశాడు రాజమౌళి. జపాన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ గొప్పదనం గురించి చెబుతున్నాడు.

నిజానికి ఓవర్సీస్, ఇండియా ప్రమోషన్ ముగిసిన తర్వాత ఎవరైనా రిలాక్స్ అవుతారు. కానీ రాజమౌళి మాత్రం తన సినిమా ప్రమోషన్ కోసం ఇంకా కష్టపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో జపనీస్ భాషలో రిలీజ్ అవుతోంది ఆర్ఆర్ఆర్ మూవీ.

First Published:  25 Sep 2022 10:28 AM GMT
Next Story