Telugu Global
Cinema & Entertainment

Nora Fatehi | హైదరాబాద్ లో ల్యాండ్ అయిన వరుణ్ తేజ్ హీరోయిన్

Nora Fatehi - బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి, హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఇందులో విశేషం ఏముందో మీరే చూడండి.

Nora Fatehi | హైదరాబాద్ లో ల్యాండ్ అయిన వరుణ్ తేజ్ హీరోయిన్
X

మెగా హీరో వరుణ్ తేజ్ తొలి పాన్ ఇండియా మూవీ 'మట్కా'. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటించనుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నోరా ఫతేహి కి ఈ సినిమాలో ఓ సాంగ్ ఉంది. దాంతో పాటు, ఆమెది ఓ కీలక పాత్ర కూడా. షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ, సినిమాలో ఛాలెంజింగ్ క్యారెక్టర్‌ కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది నోరా. 1958-1982 మధ్య కాలంలో జరిగే సినిమా కథలో వైజాగ్ అమ్మాయిగా నటించడం పెద్ద ఛాలెంజ్. ఈ పాత్ర ప్రిపరేషన్ కోసం నోరా ఫతేహి హైదరాబాద్‌లో దిగింది. 3 రోజుల పాటు ఆమె టీమ్‌తో ఉంటుంది.

మొదట్లో నోరాకి లుక్ టెస్ట్ చేశారు. తర్వాత పాత్ర ప్రిపరేషన్ కోసం వర్క్‌షాప్‌లో పాల్గొంది. సబ్జెక్ట్‌ని ఇష్టపడి, తన పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్న నోరా, మేకింగ్ దశలో తప్పులు జరగకూడదని ఇప్పట్నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటించనుండగా.. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా కోసం 60వ దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ వింటేజ్ సెట్‌ను నిర్మించనున్నారు. 60వ దశకంలోని వాతావరణాన్ని, అనుభూతిని అందించడానికి చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  16 Aug 2023 3:31 PM GMT
Next Story