Telugu Global
Cinema & Entertainment

డిసెంబర్ వచ్చేస్తోంది.. అతీగతి లేని పుష్ప-2

లెక్క ప్రకారం ఈ డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పటి వరకూ ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ లేదు.

డిసెంబర్ వచ్చేస్తోంది.. అతీగతి లేని పుష్ప-2
X

పుష్ప పార్ట్-1.. బన్నీ-సుక్కూ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ సినిమా ఇండియాను షేక్ చేసింది. పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. అదే ఊపులో పుష్ప పార్ట్-2 రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ లో పార్ట్-2ను థియేటర్లలోకి తీసుకొస్తామన్నారు. మరి డిసెంబర్ కు పుష్ప2 రిలీజ్ అవుతుందా?


రిలీజ్ మాట దేవుడెరుగు.. కనీసం ఇప్పటివరకు పుష్ప2 షూటింగ్ కూడా మొదలుకాలేదు. ఇదిగో అదిగో అంటూ ఏడాది గడిపేసింది యూనిట్. కొన్నాళ్లు బన్నీ రెస్ట్ తీసుకుంటే, మరికొన్నాళ్లు సుకుమార్ రెస్ట్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ కు భారీ మార్పుచేర్పులు చేశారు. ఊహించని విధంగా బాలీవుడ్ లో కూడా పుష్ప పెద్ద హిట్టవ్వడంతో, పుష్ప-2 స్క్రిప్ట్ కు మార్పుచేర్పులు తప్పలేదు. దీంతో సినిమా ఆలస్యమైంది.


తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. త్వరలోనే ఈ సినిమాకు కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారట. ఈ ఏడాది డిసెంబర్ లో రావాల్సిన పుష్ప2 సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా మే7న రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ తేదీనే ఎందుకంటే, అది ఆర్య రిలీజ్ డేట్ కాబట్టి.


మరికొంతమంది మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికిప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసిన, మే నెలకు సినిమాను రిలీజ్ చేయడం సుకుమార్ వల్ల కాదంటున్నారు, అతడి మేకింగ్ స్టయిల్ తెలిసిన జనాలు. అది కూడా నిజమే. ఇలాంటి వాళ్లంతా చెప్పేది ఏంటంటే.. వచ్చే ఏడాది డిసెంబర్ కు పుష్ప-2ను రిలీజ్ చేస్తారని, అదే సరైన టైమింగ్ అని అంటున్నారు.


ఏదేమైనా పుష్ప వచ్చి ఏడాదికి దగ్గరవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ సినిమాపై చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైన తర్వాత ఈ హంగామా మరింత పెరిగే అవకాశం ఉంది.

First Published:  11 Oct 2022 10:32 AM GMT
Next Story