Telugu Global
Cinema & Entertainment

BRO Movie | పవన్ సినిమాకు టికెట్ రేట్ల పెంపు లేదు

BRO movie - పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా బ్రో. టికెట్ రేట్లు పెంచకుండానే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

BRO Movie | పవన్ సినిమాకు టికెట్ రేట్ల పెంపు లేదు
X

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది బ్రో. తాజాగా సెన్సార్ కూడా పూర్తయింది. సినిమాకు U-సర్టిఫికేట్ దక్కింది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్, మీడియాతో మాట్లాడాడు. బ్రో సినిమాకు టికెట్ రేట్లు పెంచడం లేదని స్పష్టం చేశారు.

"బడ్జెట్ పరిమితి దాటలేదు. అనుకున్న బడ్జెట్ లోనే తీశాం. కాబట్టి టికెట్ రేట్లు పెంచే ఆలోచన లేదు. మా సినిమాకు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టికెట్ ధరలు సరిపోతాయి. అందుకే రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్ని సంప్రదించడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టికెట్ రేట్లకే సినిమాను ప్రదర్శిస్తాం."

బ్రో సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు విశ్వప్రసాద్. పవన్ కళ్యాణ్ సినిమాకు బయ్యర్లు రావడం లేదనే వదంతుల్ని కొట్టిపారేసిన ఆయన.. పెద్ద సినిమాకు బయ్యర్ల సమస్య ఎప్పుడూ ఉండదన్నారు.

First Published:  19 July 2023 5:30 PM GMT
Next Story