Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ సరసన ఛాన్స్.. సంబంధం లేదన్న యూనిట్

"త్వరపడండి.. రామ్ చరణ్ సరసన నటించే సువర్ణావకాశం" అంటూ ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. ఈ ప్రకటనలో ఎంత మాత్రం నిజం లేదు.

రామ్ చరణ్ సరసన ఛాన్స్.. సంబంధం లేదన్న యూనిట్
X

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మాతగా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 50శాతానికి పైగా షూటింగ్ కూడా పూర్తయింది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ కాల్ వచ్చింది. చరణ్-శంకర్ సినిమా కోసం నూతన నటీనటులు కావాలంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. దీంతో చాలామంది ఔత్సాహికులు ఈ ప్రాజెక్టు కోసం పరుగులుపెట్టారు.

నిన్నట్నుంచి జరుగుతున్న ఈ ప్రచారాన్ని యూనిట్ తిప్పికొట్టింది. కాస్టింగ్ కాల్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రచారానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రకటనలు నమ్మి, డబ్బులు ఇచ్చి మోసపోవద్దని యూనిట్ విజ్ఞప్తి చేసింది.

చరణ్-శంకర్ సినిమాకు సంబంధించి నటీనటులను ఎంపిక చేసే బాధ్యత, అధికారం మరే ఇతర వ్యక్తికి గానీ, సంస్థకు గానీ లేదని యూనిట్ తెలిపింది. ఈ విషయంలో సర్వహక్కులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి కాస్టింగ్ కాల్ ప్రక్రియ చేపట్టడం లేదని యూనిట్ ప్రకటించింది.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సునీల్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

First Published:  24 July 2022 8:22 AM GMT
Next Story