Telugu Global
Cinema & Entertainment

Nivetha Pethuraj - బిజినెస్ పై దృష్టిపెట్టిన నివేత పెతురాజ్

Nivetha Pethuraj - ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ చేయాలనుకుంటోంది హీరోయిన్ నివేత పెతురాజ్. తన బిజినెస్ ప్లాన్స్ ఏంటో చూద్దాం

Nivetha Pethuraj - బిజినెస్ పై దృష్టిపెట్టిన నివేత పెతురాజ్
X

హీరోలు బిజినెస్ చేస్తుంటారు. ఈ విషయంలో హీరోయిన్ల చొరవ కాస్త తక్కువే. వాళ్లు ఎక్కువగా పెట్టుబడులపై మాత్రమే దృష్టిపెడతారు తప్ప, వ్యాపారాలు చేయాలని అనుకోరు. అయితే కాజల్, తమన్న, తాప్సి, రకుల్ లాంటి కొద్దిమంది తారలు మాత్రం వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యారు.

ఇప్పుడీ లిస్ట్ లోకి నివేత పెతురాజ్ కూడా చేరబోతోంది. ఈ ముద్దుగుమ్మ కూడా త్వరలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తానంటోంది. మరోవైపు సినిమాలు కూడా నిర్మిస్తానని చెబుతోంది.

"నటనతో పాటు బిజినెస్ పై దృష్టి పెట్టాను. చెన్నైలో ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. అది క్లిక్ అయితే మరిన్ని రెస్టారెంట్లు మొదలుపెట్టే ఆలోచన ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే, దర్శకత్వం చేయాలని లేదు. కుదిరితే సినిమాలు నిర్మించి, మూవీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుంది."

ఇలా తన బిజినెస్ ఆలోచనలు బయటపెట్టింది నివేత పెతురాజ్. ఇలా వ్యాపారం చేయాలనే ఆలోచనతో పాటు, కెరీర్ ను విస్తరించుకునే పనిలో కూడా పడింది ఈ బ్యూటీ. త్వరలోనే బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతోంది.

First Published:  21 March 2023 3:06 AM GMT
Next Story