Telugu Global
Cinema & Entertainment

Nithin | తమ్ముడు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Nithin's Thammudu - వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.

Nithin | తమ్ముడు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
X

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్ నటిస్తున్న సినిమా తమ్ముడు. ఎంసీఏ, వకీల్ సాబ్ చిత్రాల డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈరోజు నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా నుంచి టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. టైటిల్ లోగో, పోస్టర్ చూస్తుంటే చాలా క్రియేటివ్‌గా ఉంది.

‘తమ్ముడు’ చిత్రంలో నితిన్ లుక్ కొత్తగా ఉంది. పోస్టర్‌ను గమనిస్తే ఓ బస్సు మీద చిన్నిపాటి గడ్డంతో నితిన్ కూర్చుని ఉన్నాడు. ఆయన చేతిలో సుబ్రహ్మణ్యస్వామి ఆయుధమైన శూలం ఉంది. ఆయన చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. బస్సును ఓ మహిళ డ్రైవ్ చేస్తోంది. బస్సులో సీనియర్ నటి లయ కనిపిస్తున్నారు.

గత చిత్రాలకు భిన్నంగా నితిన్ ఈ చిత్రంతో మెప్పించబోతున్నాడట. అలాగే డైరెక్టర్ శ్రీరామ్ వేణు రొటీన్‌కు భిన్నంగా ఎంటర్‌టైనర్‌తో మెప్పించనున్నారు. కాంతార, విరూపాక్ష చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  30 March 2024 5:17 PM GMT
Next Story