Telugu Global
Cinema & Entertainment

Robinhood | నితిన్ సినిమా అప్ డేట్స్

Robinhood Movie - నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రాబిన్ హుడ్. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Robinhood | నితిన్ సినిమా అప్ డేట్స్
X

హీరో నితిన్ కొత్త సినిమా పేరు రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. భీష్మ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కూడా ఇదే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే గ్లింప్స్ విడుదల చేశారు. అందులో నితిన్ పాత్రను కూడా పరిచయం చేశారు.

రాబిన్‌హుడ్ కీలక షెడ్యూల్ తాజాగా మున్నార్‌లో పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో ముఖ్యమైన టాకీ పార్ట్స్, నితిన్, ఇతర నటీనటులపై భారీ యాక్షన్ బ్లాక్‌ను చిత్రీకరించింది టీం. త్వరలోనే సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.

నితిన్ ఇందులో దొంగగా కనిపించబోతున్నాడు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.

First Published:  18 Feb 2024 1:58 PM GMT
Next Story