Telugu Global
Cinema & Entertainment

Robinhood | నితిన్ నుంచి మరో గెటప్

Robinhood - రాబిన్ హుడ్ సినిమాలో ఆల్రెడీ దొంగగా నటిస్తున్నాడు నితిన్. ఇప్పుడు ఇదే సినిమాలో ఏజెంట్ గా కూడా కనిపిస్తున్నాడు.

Robinhood | నితిన్ నుంచి మరో గెటప్
X

హీరో నితిన్, 'భీష్మ' దర్శకుడు వెంకీ కుడుముల కలిసి చేస్తున్న మరో సినిమా 'రాబిన్‌హుడ్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హ్యుమరస్ యాక్షన్ అడ్వెంచర్ టీజర్‌లో నితిన్ దొంగగా కనిపించాడు. దీనికి సంబంధించి ఆల్రెడీ గ్లింప్స్ రిలీజైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నితిన్ మరో అవతార్ లో కనిపిస్తున్నాడు.

నితిన్ పుట్టినరోజు సందర్భంగా రాబిన్‌హుడ్ సరికొత్త పోస్టర్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాలో ట్రెండీ లుక్‌ లో కనిపించిన నితిన్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌లో స్టైల్‌ గా కనిపించాడు. నితిన్ దగ్గర గన్స్ ఉన్నాయి. చూడ్డానికి అతడు ఏజెంట్ లా ఉన్నాడు. టీ-షర్టుపై ఏజెంట్ ఆర్ హెచ్ (రాబిన్‌హుడ్) అని రాసుంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. గ్లింప్స్ కోసం అద్భుతమైన స్కోర్‌ను అందించాడు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  31 March 2024 7:02 AM GMT
Next Story