Telugu Global
Cinema & Entertainment

Nithin | తమ్ముడిగా మారిన నితిన్

Nithin Thammudu - పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ తో నితిన్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు.

Nithin | తమ్ముడిగా మారిన నితిన్
X

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరో క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో "తమ్ముడు" సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రానికి "దంగల్, కహానీ,తారే జమీన్ పర్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన సత్యజిత్ పాండే (సేతు) సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 1 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ఈ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో తమ్ముడు సినిమా లాంఛ్ అవ్వడం విశేషం.

పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ తమ్ముడు. మళ్లీ ఇన్నేళ్లకు ఆ టైటిల్ ను నితిన్ సినిమా కోసం వాడుతున్నారు. స్వతహాగా పవన్ కల్యాణ్ కు వీరాభిమాని నితిన్. కాబట్టి తమ్ముడు టైటిల్ ను వాడుకోవడంపై పవన్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు.

First Published:  27 Aug 2023 2:49 PM GMT
Next Story