Telugu Global
Cinema & Entertainment

Kabzaa: నితిన్ తండ్రి చేతికి కబ్జా

Kabzaa movie Telugu rights - ఉపేంద్ర హీరోగా నటిస్తున్న సినిమా కబ్జా. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను నితిన్ తండ్రి దక్కించుకున్నారు.

Kabzaa movie release date: ఉపేంద్ర సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
X

Kabzaa movie release date: ఉపేంద్ర సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌బ్జా’. పాన్ ఇండియా రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ బ్యానర్లపై తెలుగులో రిలీజ్ అవుతుంది.

క‌న్న‌డ చిత్రాలు కె.జి.య‌ఫ్‌, 777 చార్లి, విక్రాంత్ రోణ‌, కాంతార సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్‌ క్రియేట్ చేశాయి. ఆ సినిమాల తర్వాత శాండిల్ వుడ్ నుంచి ఆ స్థాయి అంచనాలతో వస్తోంది కబ్జా. తెలుగు ప్రేక్ష‌కులకు దశాబ్దాలుగా పరిచయమున్న ఉపేంద్ర, ఈ సినిమాలో హీరోగా నటించడంతో, టాలీవుడ్ లో కబ్జాకు మంచి రీచ్ ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో క‌బ్జా సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. 1947 నుంచి 1984 కాలంలో న‌డిచే క‌థ‌ ఇది. స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు కొడుకు మాఫియా వ‌రల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. త‌ర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడ‌నే క‌థాంశంతో క‌బ్జ‌ా సినిమాను తెర‌కెక్కించారు.

కె.జి.య‌ఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. శ్రియా, కిచ్చా సుదీప్‌, శివ రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాష్ రాజ్‌, సముద్ర‌ఖ‌ని, ముర‌ళీ శ‌ర్మ‌, కృష్ణ ముర‌ళి పోసాని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

First Published:  1 Feb 2023 3:51 PM GMT
Next Story