Telugu Global
Cinema & Entertainment

Extra Ordinary Man | నితిన్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

NIthin's Extra Ordinary Man - నితిన్ నటిస్తున్న తాజా చిత్రానికి ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్ డేట్స్ చెక్ చేద్దాం..

Extra Ordinary Man | నితిన్ సినిమా షూటింగ్ అప్ డేట్స్
X


మొన్నటివరకు సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంది నితిన్ సినిమా. ఎంత సైలెంట్ అంటే, ఒక దశలో ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో, సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా నడిచింది. ఆ ప్రచారం మొదలైనప్పట్నుంచి సినిమా అప్ డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు.

నితిన్ తాజా చిత్రం పేరు ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. రైటర్ కమ్ డైరక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. మూవీకి సంబంధించి ఇప్పటివరకు 60శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.

ఇక ఈ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ కూడా ఇచ్చారు. సినిమా పాటల్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి సాంగ్ 'డేంజర్ పిల్ల' అనే లిరికల్ వీడియోను రేపు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రోమో ఆల్రెడీ రిలీజైంది. హరీశ్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

డేంజర్ పిల్ల సాంగ్‌ను కృష్ణకాంత్ రాయ‌గా, అర్మాన్ మాలిక్ ఆల‌పించారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై తెరకెక్కుతోంది ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ సినిమా. ఇందులో 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు నితిన్. డిసెంబర్ 23న థియేటర్లలోకి వస్తున్నాడు ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’.

First Published:  1 Aug 2023 5:51 AM GMT
Next Story