Telugu Global
Cinema & Entertainment

"మాచర్ల" హైలెట్స్ చెప్పిన నితిన్

మాచర్ల నియోజకవర్గం.. నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం. ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయంటున్నాడు ఈ హీరో.

Nithiin
X

నితిన్

కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తోంది మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో సాంగ్స్, పైట్స్ చూస్తే ఇదొక పక్కా మాస్ సినిమా అనే విషయం అర్థమౌతూనే ఉంది. అయితే ఈ సినిమాలో హైలెట్స్ ఏంటో స్వయంగా హీరో నితిన్ చెబితే ఎలా ఉంటుంది? ఆ టైమ్ రానే వచ్చింది. తన సినిమా హైలెట్స్ ఏంటో నితిన్ చెప్పుకొచ్చాడు.

"మాచర్ల నియోజకవర్గంలో సముద్రఖని, రాజేంద్రప్రసాద్, బ్రహ్మజీ, వెన్నెల కిషోర్ ఉన్నారు. ఇందులో వెన్నెల కిషోర్ కామెడీ, సముద్రఖని విలనీ చాలా బాగుంటాయి. మా కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బావుంటాయి. మహతి స్వరసాగర్ అద్భుతమైన ఆల్బం ఇచ్చాడు. ఆడియో ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది. ఆర్ఆర్ చేయడంలో మణిశర్మ గారు కింగ్ అంటారు. కానీ ఈ సినిమాలో సాగర్ తండ్రిని మించిన తనయుడనిపిస్తాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగొట్టాడు. ఈ చిత్రంలో ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ఉన్న ఫైట్స్ నా కెరీర్ లోనే ది బెస్ట్ ఫైట్స్. అనల్ అరుసు, వెంకట్, రవి వర్మ, విజయ్ మాస్టర్స్ ఇరగదీశారు. ప్రతి ఫైట్ హైలెట్. దర్శకుడు శేఖర్ కు ఇది తన మొదటి సినిమాలా ఉండదు. చాలా అనుభవం వున్న దర్శకుడిలా ఈ సినిమాని తీశాడు."

ఇలా మాచర్ల నియోజకవర్గంలో హైలెట్స్ చెప్పాడు నితిన్. వీళ్లతో పాటు హీరోయిన్లు క్యాథరీన్, కృతిషెట్టి అందాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని అన్నాడు .ఈనెల 12న థియేటర్లలోకి వస్తోంది మాచర్ల నియోజకవర్గం. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు.

First Published:  8 Aug 2022 7:44 AM GMT
Next Story